సెకండ్ ఇన్నింగ్స్ కి కాజల్ రెడీ..!

Pulgam Srinivas
అందాల ముద్దు గుమ్మ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . లక్ష్మీ కళ్యాణం మూవీ తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన కాజల్ అగర్వాల్ 'చందమామ' మూవీ తో తెలుగు నాట మంచి విజయాన్ని అందుకుంది . ఆ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన మగధీర మూవీ తో కాజల్ అగర్వాల్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజీ హీరోయిన్ గా మారి పోయింది .

ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దు గుమ్మ అతి తక్కువ కాలం లోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది . ఈ ముద్దు గుమ్మ ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది . కాజల్ అగర్వాల్ కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా తమిళ , హిందీ సినిమాల్లో కూడా నటించి అక్కడి ప్రేక్షకులను కూడా బాగానే అలరించింది .

ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే . అలాగే కొన్ని రోజుల క్రితమే కాజల్ అగర్వాల్ ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది .  పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటించిన కాజల్ అగర్వాల్ ఆ తర్వాత గర్భవతి కావడంతో సినిమాలకు దూరంగా ఉంది . ఇది ఇలా ఉంటే మళ్ళీ కాజల్ అగర్వాల్ కి సినిమా ల్లోకి రావాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది . అందులో భాగంగా తన మేనేజర్ లకు కూడా కొత్త ఆఫర్ లను కనుగొన్నామని సూచించినట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: