ఆకట్టుకున్న ఘోస్ట్: ట్రైలర్, మూవీ రిలీజ్ అప్పుడే?

Purushottham Vinay
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో కింగ్ నాగార్జున ఈ ఏడాది బంగార్రాజు సినిమాతో మంచి కంబ్యాక్ హిట్ ని సొంతం చేసుకున్నాడు. ఆ సినిమాతో నిర్మాతగా కూడా మంచి లాభాలను పొందాడు. ఇక ఆ ఊపులో నాగ్ హీరోగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ది ఘోస్ట్. ఈ సినిమా అయితే పక్కా యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. కింగ్ నాగార్జున చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు ఓ మాంచి యాక్షన్ సినిమాలో నటిస్తున్నాడు.ఖచ్చితంగా ఈ సినిమా మరో సూపర్ హిట్ ఇస్తుందని నాగ్ భావిస్తున్నాడు.ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ప్రోమోలు ఇంకా అలాగే పోస్టర్స్ చాలా విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో ప్రోమో కూడా విడుదలైంది. 'తమ హగనే' అనే పేరుతో విడుదలైన ఈ వీడియో ప్రేక్షకులను చాలా విపరీతంగా ఆకట్టుకుంటోంది.ఈ వీడియోలో కింగ్ నాగార్జున లోహంతో ఒక పొడవాటి కత్తిని సొంతంగా తయారు చేసుకోవడం చూపించారు. ఆ తర్వాత అక్కడికి భారీగా పోలీసులు చేరుకోవడం ఇంకా ఆ తర్వాత ఏం జరిగిందో తెలియకుండా సస్పెన్స్ ఉంచుతూ రక్తపు మరకలతో నిండిన కత్తిని నాగార్జున తిరిగి ఒరలోకి పెట్టుకోవడం అనేది ఇందులో చూపించారు.


ఈ ప్రోమో చూస్తుంటే కింగ్ నాగార్జున ఇక ఇంతకుముందెప్పుడూ ఇటువంటి పాత్ర పోషించలేదనిపిస్తోంది.ఈ ప్రోమోలో భరత్ ఇంకా సౌరభ్‌లు అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకునేలా ఉంది. ఇంకా అలాగే ప్రోమో లో ఈ సినిమా ట్రైలర్ ఆగస్టు 25 వ తేదీన విడుదల చేయనున్నట్లు అఫీషియల్‌గా కూడా ప్రకటించారు.ఇంకా అక్టోబర్ 5వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా గ్రాండ్ గా విడుదల కానుంది. నాగార్జున- ప్రవీణ్ సత్తార్ కాంబినేషన్‌లో మొట్టమొదట సినిమాగా వస్తున్న ఈ యాక్షన్ సినిమాపై ప్రేక్షకుల్లో అనేక రకాల భారీగా అంచనాలు కూడా ఉన్నాయి. కాగా ఇక నాగార్జున నటిస్తున్న ఈ సినిమాను నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై శరత్ మరార్ నిర్మిస్తున్నారు.ఖచ్చితంగా నాగార్జున ఈ సినిమాతో హిట్ కొట్టడం పక్కా అని అక్కినేని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి చూడాలి ఈ సినిమాతో నాగ్ ఎలాంటి హిట్ ని అందుకుంటాడో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: