పెళ్ళై, ఓ పిల్లాడు ఉన్న యువతిని పెళ్లి చేసుకున్న బ్రహ్మాజీ.. ఆమె ఎవరంటే..?

Anilkumar
సీనియర్ నటుడు బ్రహ్మాజీ తెలియని వ్యక్తులు ఉండరు.అయితే బ్రహ్మాజీ వయస్సు 57 సంవత్సరాలు కాగా చూడటానికి మాత్రం ఆయన 35 సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తిగా కనిపిస్తారు.ఇకపోతే ఆయన తెలుగు సినిమాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించి మెప్పించారు.అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఇండస్ట్రీకి వచ్చి 28 సంవత్సరాలు అవుతోందని తెలిపిన బ్రహ్మజీ తాను నటుడిని కావడంతో ఐఏఎస్, ఐపీఎస్ లకు దక్కిన స్థాయిలో గుర్తింపు దక్కుతోందని నటుడు కావడం అనేది అదృష్టం అని బ్రహ్మాజీ చెప్పుకొచ్చారు.అంతేకాదు తన జీవితానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.

ఇకపోతే  చెన్నైలో ఉన్నప్పుడు పరిచయమైన ఒక బెంగాలీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని ఆయన తెలిపారు.అయితే ఇక తమకు పెళ్లి జరిగే సమయానికి ఆమె భర్త నుంచి విడాకులు తీసుకుందని… అప్పటికే ఆమెకు ఓ బాబు ఉన్నాడని చెప్పారు. ఇక అప్పటికే బాబు ఉన్నప్పుడు మనకు మళ్లీ పిల్లలు ఎందుకని అనిపించిందని… అందుకే పిల్లలు వద్దనుకున్నామని తెలిపారు.  అంతేకాదు ఆ అబ్బాయి ‘పిట్టకథ’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడని చెప్పారు.ఇకపోతే ‘తూర్పు గోదావరి జిల్లాలో పుట్టిన నేను పశ్చిమ గోదావరి జిల్లాలో పెరిగా. కాగా మా తండ్రిగారు తహసీల్దార్‌. ఇక అప్పట్లో సీనియర్‌ నటుడు సోమయాజులు గారు సైతం ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు.

ఇక ఇదిలా ఉంటే ఆయన నటించిన ‘శంకరాభరణం’ రిలీజై మంచి విజయం సాధించింది.  అయితే ఈ సక్సెస్‌తో సోమయాజులు గారికి విపరీతమైన క్రేజ్‌ పెరిగింది.పోతే  దీంతో ఆయనకు భారీగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఇక అది చూసిన నేను.. సినిమాల్లోకి వెళ్తే ఇంత ఆదరణ ఉంటుందా? అని అనిపించింది.అయితే చదువు పూర్తయిన తర్వాత చెన్నైకి వెళ్లి నటనలో శిక్షణ తీసుకున్నానని తెలిపారు. పోతే ట్రైనింగ్ తీసుకునే సమయంలోనే తనకు రవితేజ, కృష్ణవంశీ, రాజా రవీంద్ర వంటి వారు పరిచయమయ్యారని చెప్పారు.అయితే  తన కెరీర్ తొలి రోజుల్లోనే మంచి గుర్తింపు వచ్చిందని… అయితే ఆ తర్వాత పదేళ్ల పాటు వచ్చిన పాత్రలు తనకు సంతోషాన్ని ఇవ్వలేదని తెలిపారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: