ఆది సాయి కుమార్ 'తీస్ మర్ ఖాన్' మూవీ నుండి తీమ్ సాంగ్ విడుదల తేదీ వచ్చేసింది..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ హీరోల్లో ఒకరు ఆయన ఆది సాయి కుమార్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆది సాయి కుమార్ ప్రేమ కావాలి మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ప్రేమ కావాలి మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఆ  తర్వాత ఈ హీరో లవ్లీ మూవీలో హీరోగా నటించాడు. ఈ మూవీ కూడా మంచి విజయం అందుకుంది. ఇలా వరుసగా రెండు సినిమాలతో మంచి విజయాలను అందుకున్న ఆది సాయి కుమార్ ఆ తర్వాత అనేక సినిమాలలో హీరోగా నటించాడు. కాకపోతే ఆ సినిమాలు ఏవి ఈ హీరో కి బాక్సా ఫీస్ దగ్గర విజయాలను తెచ్చి పెట్టలేక పోయాయి.
 

ఇది ఇలా ఉంటే తాజాగా ఆది సాయి కుమార్ తిస్ మర్ ఖాన్ అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ లో ఆది సాయి కుమార్ సరసన పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కి కళ్యాణ్ జి గోగణ దర్శకత్వం వహించగా , ప్రముఖ వ్యాపారవేత్త డా నాగం తిరుపతిరెడ్డి ఈ మూవీ ని విజన్ సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 3 గా నిర్మిస్తున్నారు. ఈ మూవీ ని ఈ నెల అనగా ఆగస్ట్ 19 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఇది వరకే మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ విడుదల తేది దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ చిత్ర బృందం ప్రమోషన్ లను మొదలు పెట్టింది. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ యూనిట్  ఒక క్రేజీ అప్డేట్ ని విడుదల చేసింది. ఈ మూవీ నుండి తీమ్ సాంగ్ ని ఈ రోజు అనగా ఆగస్ట్ 16 వ తేదీన సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: