'తీస్ మర్ ఖాన్' మూవీ అయినా ఆది సాయి కుమార్ కి హిట్ ని తీసుకువస్తోందా..?

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న యువ హీరోల్లో ఒకరు అయినా ఆది సాయి కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆది సాయి కుమార్ 'ప్రేమ కావాలి' మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ లోని ఆది సాయి కుమార్ తన నటన తో, డాన్స్ తో ప్రేక్షకులను అలరించాడు. అలాగే ప్రేమ కావాలి మూవీ కూడా బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. అలా మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని అందుకున్న ఆది సాయి కుమార్ ఆ తర్వాత లవ్లీ మూవీ తో మరో విజయాన్ని అందుకున్నాడు. రెండు విషయాలను బాక్సాఫీస్ దగ్గర అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రేజీ హీరోగా మారిపోయిన ఆది సాయి కుమార్ 'లవ్లీ' మూవీ తర్వాత ఇప్పటి వరకు అనేక మూవీ  లలో హీరోగా నటించాడు.

కాక పోతే ప్రేమ కావాలి , లవ్లీ రేంజ్ విజయాలను మాత్రం బాక్సా ఫీస్ దగ్గర ఆది సాయి కుమార్ ఇప్పటి వరకు అందించలేకపోయాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఆది సాయి కుమార్ 'తిస్ మర్ ఖాన్' అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ లో ఆది సాయి కుమార్ సరసన  పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించగా , ఈ మూవీ కి కళ్యాణ్ జి గోగణ దర్శకత్వం వహించాడు. విజన్ సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్  3 గా ప్రముఖ వ్యాపారవేత్త  డా నాగం తిరుపతి రెడ్డి  ఈ మూవీ ని నిర్మించారు. ఈ మూవీ ని ఆగస్ట్ 19 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. మరి ఈ మూవీ తో అయిన ఆది సాయి కుమార్ బాక్సా ఫీస్ దగ్గర హిట్ అందుకున్నాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: