దయచేసి మా సినిమాను బహిష్కరించకండి అంటూ వేడుకుంటున్న కరీనాకపూర్..!!

Divya
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ముఖ్యమైన పాత్రలో నటించిన తాజా చిత్రం లాల్ సింగ్ చద్దా.. ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇక డైరెక్టర్ అద్వైత్ చందన్ ఈ సినిమాని దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపో తోంది. అయితే ఈ సినిమా విడుదల డేట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమాని బాయికాట్ చేయడం జరుగుతుంది ఈ చిత్రాన్ని ఎవరు చూడకూడదని బహిష్కరించాలంటే సోషల్ మీడియాలో చాలా జోరుగా ప్రచారం జరుగుతున్నది.

తాజాగా ఈ సినిమాపై వస్తున్న నెగటివ్ ప్రచారంపై హీరోయిన్ కరీనాకపూర్ స్పందించడం జరిగింది. ఇటీవల ఇంటర్వ్యూలో కరీనాకపూర్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో కొంతమంది మాత్రమే కావాలని ఈ సినిమాని ట్రోల్ చేస్తున్నారని తెలిపింది. కానీ సినీ ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన మరొక లాగా ఉందని తెలిపింది. కేవలం సినిమా పైనే టార్గెట్ చేస్తూ కొంత మంది నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని తెలిపారు. కరీనా కపూర్ మాట్లాడుతూ ఇది ఒక అద్భుతమైన చిత్రం కచ్చితంగా తెలపైన ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అని తెలిపింది.

అంతేకాకుండా ఈ సినిమా తెరకెక్కించడం కోసం మూడు సంవత్సరాలుగా చాలా కష్టపడ్డామని తెలిపింది. ఈ సినిమా పైన నెగటివ్ ప్రచారం చేసి మంచి సినిమాను బహిష్కరించవద్దు అంటే తెలిపింది. మూడు సంవత్సరాలు అంటే 350 మంది సినిమా కోసం పనిచేశారని తెలిపింది దయచేసి ఈ సినిమాని బహిష్కరించకండి అంటూ చాలా విజ్ఞప్తి చేస్తూ తెలిపింది. ఈ సినిమా మొదటి రోజే బాక్స్ ఆఫీస్ దగ్గర రూ.11.50 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది హాలీవుడ్ సూపర్ హిట్ ఫారెస్ట్ గంప్ సినిమాకి ఈ సినిమా రిమేక్ అని తెలిపింది. ఇక ఈ సినిమాలో నాగచైతన్య కీలకమైన పాత్రలో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: