కమెడియన్ కి కాలం కలిసి వస్తే ఇలా ఉంటుందా.?

Divya
టాలీవుడ్ కమెడియన్లలో శ్రీనివాస్ రెడ్డి కూడా ఒకరు. ఆయన ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటికీ చాలా కాలం అవుతుంది. దాదాపుగా స్టార్ హీరోలు అందరి కాంబినేషన్లో నటించి నవ్వించారు. బ్రహ్మానందం, ఎంఎస్, ఏవీఎస్ వంటి సీనియర్ల నటులకు తట్టుకొని నిలబడ్డాడు ఈయన. అటు సునీల్ ఇటు వెన్నెల కిషోర్ తదితర కమెడియన్లు ఉన్నప్పటికీ కూడా పలు అవకాశాలను వచ్చేలా చేసుకోగలిగాడు. కొంతమంది కమెడియన్లు మాదిరిగా హీరో వేషాలు వైపు వెళ్లిన కానీ కామెడీని మాత్రం వదిలిపెట్టలేదు. తాను కమెడియన్ ను మాత్రమే అంటూ పలు రూట్స్ లో  వెళ్లడానికి ఆసక్తిని చూపిస్తూ ఉంటాడు శ్రీనివాసరెడ్డి.
శ్రీనివాస్ రెడ్డి తనకంటూ ఒక టైమింగ్ ని మెయింటైన్ చేస్తూ డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను బాగా నవ్విస్తూ ఉంటారు. రాజేంద్రప్రసాద్ స్థాయికి తగిన టైమింగ్ ఆయనలో కనిపిస్తూ ఉంటుందని పలువురు తెలియజేస్తూ ఉంటారు. ఇక జనరేషన్లో చిత్రగుప్తుడు పాత్రను పోషించాలి అంటే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది ఈయనే అని చెప్పవచ్చు. ప్రస్తుతం శ్రీనివాస్ రెడ్డి వరుస పెట్టి సినిమాలో చేస్తూ ఉన్నాడు. కానీ ఆయన స్థాయికి తగిన పాత్రలు పడటం లేదని చెప్పవచ్చు. దాంతో కెరీర్ పరంగా కాస్త వెనుకబడినట్టు అనిపించింది. అయితే ఈసారి మాత్రం ఆయనకి కాలం అనుకూలంగా మారుతున్నట్టుగానే కనిపిస్తున్నది.
ఇటీవల బింబిసార సినిమాలో జుబేదా అనే పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. మీసాలు మెలు తిరిగిన లుక్ లో రాజు గారి ప్రధానమైన అనుచరుడిగా ఉంటూ కడుపుబ్బ నవ్వించారు. ఇకపై ఎవరైనా జానపద సినిమాలు  చేస్తే శ్రీనివాస్ రెడ్డి లేకుండా చేయడం కష్టం అనిపించేలా నటించాడు. తమిళంలో వడివేలు తరహా తర్వాత అదే స్థాయిలో ప్రేక్షకులను నవ్వించాడని చెప్పవచ్చు. ఇక అలాగే కార్తికేయ-2 లో కూడా కృష్ణ భక్తుడిగా ఆయన ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇక ఇందులో కూడా ఈయన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు అతి తక్కువ సమయంలో ఈ రెండు సినిమాలలో విభిన్నమైన పాత్రలు నటించి మరిన్ని అవకాశాలను అందుకున్నాడు శ్రీనివాస్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: