మహాధన్ కు బదులు మాధవ్ ఎంట్రీలో ఆంతర్యం !

Seetha Sailaja

‘రాజా ది గ్రేట్’ మూవీలో రవితేజా కొడుకు మహాధన్ నటించడంతో మాస్ మహారాజ అభిమానులు తమ హీరో వారసుడు ఎంట్రీ ఎప్పుడు అంటూ తరుచు రవితేజా ను అడుగుతూ ఉంటారు. నాలుగు పాటలు నాలుగు ఫైట్స్ ఉండే సినిమాలు తన కొడుకుకు నచ్చవని అందువల్ల అతడు ఇండస్ట్రీలోకి వస్తాడు అని అనుకోవడంలేదని అయితే భవిష్యత్ లో ఏమి జరుగుతుందో తనకు తెలియదు అంటూ రవితేజా ఈవిషయమై గతంలో క్లారిటీ కూడ ఇచ్చాడు.

ఇప్పుడు రవితేజా వారసుడు ఎంట్రీ మరొక విధంగా జరుగుతోంది. రవితేజా కు తన సోదరులతో చాలమంచి సాన్నిహిత్యం ఉంది. మాస్ మహారాజ సోదరుడు రఘు కొడుకు మాధవ్ భూపతిరాజు ఇప్పుడు ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. చాలామంది యంగ్ హీరోలకు కలిసి వచ్చిన లవ్ స్టోరీ సబ్జక్ట్ ను ఇతడు కూడ ఎంచుకున్నాడు.

‘ఏయ్ పిల్లా’ అన్న టైటిల్ తో నిర్మాణం ప్రారంభం కాబోతున్న ఈమూవీ కథ ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ అంటున్నారు. మిస్. ఇండియా రన్నరప్ రూబెన్ షకావత్ ఈమూవీ ద్వారా హీరోయిన్ గా పరిచయం అవుతోంది. మోడలింగ్ ఇండస్ట్రీలో మంచి పేరున్న ఈమె అనేక ఫ్యాషన్ షోలలో పాల్గొంది. దర్శకుడు రమేష్ వర్మ వ్రాసిన ఒక వెరైటీ కథకు లుదీర్ బైరెడ్డి అనేక కొత్త దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నాడు. 1990 కాలం నాటి ప్రేమకధ అని తెలుస్తోంది.

రవితేజా వరసపెట్టి సినిమాలు చేస్తూ ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ అతడి సినిమాలు హిట్ అవ్వడం కష్టంగా మారింది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఘోరమైన ఫ్లాప్ గా మారడంతో దాని ప్రభావం రవితేజా మార్కెట్ పై చాల ఎక్కువగా పడింది అంటున్నారు.  అయినప్పటికీ రవితేజా స్పీడ్ తగ్గడంలేదు. ఇలాంటి పరిస్థితులలో రవితేజా వారసుడు ఎంతవరకు సక్సస్ అవుతాడో చూడాలి. మాస్ మహారాజా అభిమానులు ఇతడిని ఆదరిస్తే మరో యంగ్ హీరో ఇండస్ట్రీకి దొరికినట్లే అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: