మాచర్ల నియోజకవర్గం సినిమా ఎలా ఉందంటే..?

Divya
హీరోగా పరిచయమైన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా పేరు పొందాడు హీరో నితిన్ తన కెరియర్ లో ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న నితిన్ తనకంటూ యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. అయితే కథలు ఎంపికలు పలు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో వరుసగా ఫ్లాప్లు చవి చూశాడు. అయితే ఆ తర్వాత భీష్మ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న నితిన్ ఆ తర్వాత మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. తాజాగా నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం అనే సినిమా విడుదల అయ్యింది వాటి గురించి చూద్దాం.

మాచర్ల నియోజకవర్గం సినిమాని ఎమ్మెస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందించారు ఈ సినిమాలో హీరోయిన్స్ గా కృతి శెట్టి, కేథరిన్ నటించారు. గుంటూరు జిల్లాలో పనిచేస్తున్న ఒక ఐపీఎస్ ఆఫీసర్ ప్రస్తుతం ఉన్న రాజకీయాల పరిస్థితులపై ఎలా పోరాటం చేస్తాడు అనే కథ అంశంతో ఈ సినిమాని తెరకెక్కించారు పూర్తిస్థాయిలో మాస్ మసాలా అంశంతో తెరకెక్కించిన ఈ చిత్రం వరుస అప్డేట్లను ఇస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా చేసింది. ఇక ఈ సినిమా విడుదల సమయంలో కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక ఈ సినిమా నైజాంలో రూ.6 కోట్ల రూపాయలు , సి డెడ్ రూ.3 కోట్ల రూపాయలు ,ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కలుపుకొని 10 కోట్ల రూపాయలు బిజినెస్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం బిజినెస్ విషయానికి వస్తే రూ.19 కోట్ల రూపాయల వరకు బిజినెస్ జరిగింది. ఇక ప్రపంచవ్యాప్తంగా రూ.21.20 కోట్ల రూపాయలు బిజినెస్ చేసుకుంది అందుకు తగ్గట్టుగానే ఈ చిత్రం గ్రాండ్గా విడుదలయ్యింది. ఇప్పటికే యూఎస్ లో సహా ఇండియాలను కొన్ని ప్రాంతాలలో మాత్రమే షో  ప్రారంభమై అన్ని ఏరియాలలో ఈ సినిమా ఊహించని విధంగా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాతో హీరోని మాస్ హీరోగా అనిపించుకున్నాడని చెప్పవచ్చు. మరి ఈ సినిమా ఎలాంటి కలెక్షన్లను రాబడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: