ప్రభాస్ తో చేయవలసిన సినిమా ఎన్టీఆర్ చేశారా..?

Divya
అశ్విని దత్ అనగానే ఎవరికైనా సరే వెంటనే వైజయంతి మూవీస్ బ్యానర్ గుర్తుకొస్తుంది ఆ బ్యానర్ పై వచ్చిన ఎన్నో సినిమాలు విజయాలను అందుకున్నాయి. ఇక ఈ బ్యానర్ పైన ఎన్నో తరాల నుంచి సినిమాలు చేస్తూ వస్తున్నారు ఇక ఈ బ్యానర్ ఇప్పటికీ 50 ఏళ్లు పైగా నడుస్తూ ఉన్నది అప్పటినుంచి ఇప్పటివరకు ఈ బ్యానర్లు ఒక్క సినిమా చేస్తే చాలు సినీ హీరోలకి కెరియర్ మారిపోతుందని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. రీసెంట్గా ఈయన బ్యానర్ లోనే వచ్చిన సీతారామం చిత్రం కూడ మంచి విజయాన్ని అందుకున్నది. తాజాగా ఆలీతో సరదాగా ప్రోగ్రాం లో పాల్గొన్న అశ్వనీ దత్ పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.

ఆలీ అడిగిన ప్రశ్నలకు అశ్వని దత్ స్పందిస్తూ తన బ్యానర్ లోగో లో సీనియర్ ఎన్టీఆర్ కృష్ణుడుగా ఉంటారని ఇప్పటికి అప్పటికి నేను ఆయన అభిమానిని దైవంగానే భావిస్తూ ఉంటానని తెలిపారు. ముఖ్యంగా ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ఇండస్ట్రీకి వచ్చానని ఇక్కడ తట్టుకోవడం చాలా కష్టమని చెప్పినా కూడా నేను వినలేదని తెలిపారు. ఎన్టీఆర్ తో మొదటి సినిమా ఎదురులేని మనిషి.. సినిమా చేస్తే 16 లక్షలు అయ్యింది యువ పురుషుడు సినిమాకి 20 లక్షలు అయింది. ఇక తమ బ్యానర్ కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని తెలిపారు.

అదేమిటంటే మహేష్ బాబు రాజకుమారుడు తో ,రామ్ చరణ్ చిరుత సినిమాతో, అల్లు అర్జున్ గంగోత్రి సినిమాతో మా బ్యానర్ పైన పరిచయమయ్యారని తెలిపారు. ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తీశాము ఈ కథ విన్న తర్వాత ఎవరితో చేయాలంటే బాగుంటుందని ఆలోచనలు ఉన్నామని కథపరంగా ప్రభాస్ ని అనుకోక ఒకరోజు హరికృష్ణ ఫోన్ చేసి.. మాట్లాడుతున్న సమయంలో ఈ సినిమా గురించి ఎన్టీఆర్ ని అడుగుదామని అనుకున్నారట కానీ ప్రస్తావించడం సరైన సమయం కాదని అనుకున్నాడట అశ్వని దత్ ఎటు తిరిగి ఎన్టీఆర్ ఈ సినిమాలో నటించడం జరిగిపోయింది అని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: