ప్రముఖ యాంకర్ తో.. మెగా హీరో ఎంగేజ్మెంట్..!!

Divya
ఈ కథలో పాత్రలు కల్పితం అనే సినిమాతో మొదటిసారిగా వెండితెరకు పరిచయమయ్యారు హీరో పవన్ తేజ్. ఇక ఈ హీరో మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా అరగంటం చేశారు. ఇప్పుడు తాజాగా ఒక ఇంటి వాడు కూడా కాబోతున్నట్లు తెలుస్తోంది బుల్లితెరపై ప్రముఖ యాంకర్ మేఘనాను పవన్ వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది అందుకు సంబంధించి ఇరువురు కుటుంబాల సమక్షంలో వీరిద్దరి నిశ్చితార్థం కూడా చాలా గ్రాండ్గా జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ వేడుకకు చిరంజీవి సతీమణి సురేఖ, యాంకర్ సుమ రాజీవ్ కనకాల సాయి ధరంతేజ్ తదితరులు పాల్గొనడం జరిగింది.

పవన్ తేజ్ హీరోగా నటించిన ఈ కథలో పాత్రలు కల్పితం అనే చిత్రంతో మేఘన హీరోయిన్గా నటించింది. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైందని వీరి ప్రేమకు ఇరువురు కుటుంబాలు కూడా అంగీకారం చెప్పడంతో త్వరలోనే వీరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆమెను ప్రేమిస్తున్నాను నాకు ప్రేమంటే తెలిసింది ఆమె వల్లే అంటూ తన ఇంస్టాగ్రామ్ ద్వారా వారిద్దరు దిగిన కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ పవన్ తేజ్ తెలియజేయడం జరిగింది. ఇక అంతే కాకుండా నా జీవితం నీకే సొంతం ప్రేమ తెలిసిన నీతోని నిశ్చితార్థం చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది అంటూ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.

దీంతో మెగా ఫ్యామిలీ లో త్వరలో వివాహ వేడుకలు జరగబోతున్నాయని మెగా అభిమానులు సైతం చాలా సంబరపడుతున్నారు. ఇక ఈ పవన్ తేజ్ ఎవరో కాదు చిరంజీవి సోదరుడు కుమారుడు అన్నట్లుగా సమాచారం. ప్రస్తుతం పవన్ తేజ్, మేఘనకు సంబంధించి నిశ్చితార్థం ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి. పవన్ తేజ్ కేవలం కొన్ని సినిమాలలోనే మాత్రమే నటించారు ఆ తర్వాత పలు సినిమాలలో సైడ్ యాక్టర్ గా కూడా నటిస్తూ ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: