'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' మూవీ నుండి అదిరిపోయే అప్డేట్..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ హీరోల్లో ఒకరు అయిన కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజావారు రాణి గారు మూవీ తో వెండి తెరకు పరిచయం అయిన ఈ యువ హీరో ఎస్ ఆర్ కళ్యాణమండపం మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను దక్కించుకున్నాడు. తాజాగా కిరణ్ అబ్బవరం 'సమ్మతమే' అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ లో చాందిని చౌదరి హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం వరుస మూవీ లలో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం నటిస్తున్న మూవీ లలో నేను మీకు బాగా కావాల్సిన వాడిని మూవీ ఒకటి.  ఈ మూవీ కి కార్తిక్ శంక‌ర్ అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహిస్తుండగా , శ‌తాధిక చిత్ర ద‌ర్శ‌కుడు కీర్తిశేషులు శ్రీ కోడి రామ‌కృష్ణ గారి పెద్ద కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాత‌గా కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌లో ఈ మూవీ ని తెరకెక్కిస్తున్నారు.
 

ఈ మూవీ కి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ మూవీ ని సెప్టెంబర్ 9 వ తేదీన విడుదల చేయనున్నారు. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ని యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఈ మూవీ నుండి నచ్చావ్ అబ్బాయి అనే లిరికల్ సాంగ్ ను ఆగస్ట్ 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తే ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: