పోకిరి ట్రెండ్ ని ఫాలో అవుతున్న నాగ్ ఫ్యాన్స్?

Purushottham Vinay
టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు  పుట్టినరోజు సందర్భంగా ఆయన సూపర్ అభిమానులు ఇంకా అలాగే డిస్ట్రిబ్యూటర్లు పోకిరి సినిమా స్పెషల్ షోలు భారీ స్థాయిలో వేసిన సంగతి తెలిసిందే.సుమారు 370 కుపైగా లొకేషన్లలో పోకిరి సినిమా రీరిలీజ్ చేశారని ఇప్పటివరకున్న సమాచారం.ఈ సినిమాని రీ రిలీజ్  చేసిన చాలా ప్రాంతాల్లో కూడా హౌస్‌ఫుల్ అయ్యాయి. ఇంకా అలాగే స్పెషల్ షోల ద్వారా మంచి మొత్తంలో కలెక్షన్లు వచ్చినట్టు ఇన్ సైడ్ టాక్‌. కాగా ఇపుడు ఈ పోకిరి సినిమా స్పెషల్ షోల ప్రభావం అక్కినేని నాగార్జున అభిమానుల పై పడిందన్న వార్త అయితే టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.ఇక పోకిరి సినిమా ఏంటీ..? నాగార్జున అభిమానులేంటి..?అని మీరు తెగ ఆలోచిస్తున్నారా..మా హీరో సినిమా విడుదల కూడా ఎప్పుడని ఇప్పుడు నాగ్ ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారట. 


ఇంతకీ ఇక ఆ సినిమా ఏంటనే కదా మీ డౌటు.కింగ్ నాగార్జున ఎంట్రీతో ఇండస్ట్రీని షేక్ చేసిన చిత్రం శివ. ఇక రాంగోపాల్ శర్మ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం రీమాస్టర్డ్ వెర్షన్‌ను విడుదల చేయాలని రామ్ గోపాల్ వర్మకు విజ్ఞప్తులు వస్తున్నట్టు జోరుగా టాక్ అనేది వినిపిస్తోంది.ఆగస్టు 29 వ తేదీన నాగార్జున పుట్టినరోజు సందర్భంగా శివ 4K versionను రిలీజ్ చేయాలని రిక్వెస్ట్ పెడుతున్నారని సమాచారం తెలుస్తోండగా..దీనిపై రామ్ గోపాల్ వర్మ ఎలా స్పందిస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇంకా అలాగే మరోవైపు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కూడా జల్సా సినిమా రీరిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి.ఇలా మహేష్ బాబు ఫ్యాన్స్ సెట్ చేసిన ట్రెండ్ ని మిగతా హీరోల ఫ్యాన్స్ కూడా ఫాలో అవ్వాలనుకుంటున్నారు. అందుకే తమ అభిమాన హీరో పుట్టినరోజు నాడు కూడా తమ అభిమాన సినిమాలను రీ రిలీజ్ చెయ్యాలని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: