ఆ కారణంగా మహేష్ బాబు 28వ సినిమా ఆలస్యం..!

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు కొంత కాలం క్రితం విడుదల అయిన సర్కారు వారి పాట మూవీ తో అదిరి పోయే విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే భరత్ అనే నేను , మహర్షి , సరిలేరు నీకెవ్వరు , సర్కారు వారి పాట ఇలా వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న మహేష్ బాబు మరి కొన్ని రోజుల్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లో 28 వ సినిమా.

ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ ని ఆగస్ట్ నెలలో ప్రారంభించనున్నట్లు , ఆ తర్వాత ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సమ్మర్ లో విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇది ఇలా ఉంటే ఆగస్ట్ నెలలో మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్ట్ 9 వ తేదీన ఈ సినిమా షూటింగ్ ని ప్రారంభించాలి అని మూవీ మేకర్స్ అన్నీ రెడీ చేసుకున్న సమయంలో ప్రస్తుతం షూటింగ్ లు బంద్ చేయడంతో ఈ సినిమా షూటింగ్ ఈ నెల చివరన ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇలా మహేష్ బాబు 28 వ సినిమా విషయంలో ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న మూవీ లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుండగా , ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించబోతున్నాడు. ఈ మూవీ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు , దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: