బింబిసార vs సీతారామం: వసూళ్లలో ఏది టాప్?

Purushottham Vinay
ఇక టాలీవుడ్ బాక్సాఫీస్ మళ్లీ కళకళలాడుతోంది. గత శుక్రవారం నాడు విడుదలైన బింబిసార, సీతారామం చిత్రాలు చాలా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని తొలి వారాంతంలో ఆ సినిమాలు మంచి వసూళ్లు రాబట్టాయి.ఐతే రెండింట్లో ఎక్కువ పాజిటివ్ రివ్యూలు టాక్ వచ్చింది మాత్రం సీతారామం మూవీకే. కానీ తొలి వారాంతంలో వసూళ్ల పరంగా బింబిసార సినిమా పైచేయి సాధించింది. సీతారామం మూవీకి తొలి మూడు రోజుల్లో మొత్తం రూ.10 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ వస్తే.. బింబిసార సినిమాకు దాని కంటే రూ.8 కోట్లకు పైగా షేర్ ఎక్కువ వచ్చింది.ఐతే మాస్ మూవీ కావడం వల్ల రిలీజ్‌కు ముందు నుంచే బింబిసార సినిమాకు హైప్ ఉంది. తొలి రోజు పూర్తిగా ఆ చిత్రం ఆధిపత్యం తన చలాయించింది. కానీ తొలి రోజు సాయంత్రం నుంచి పుంజుకున్న సీతారామం సినిమా.. శని, ఆదివారాల్లో దానికి దీటుగానే వసూళ్లుని బాగానే రాబట్టింది.


ఇక వీకెండ్ అయ్యాక సీతారామం బాక్సాఫీస్ లీడర్‌గా అవతరించే సంకేతాలుకూడా కనిపిస్తున్నాయి. తెలుగులోనే కాక తమిళం, మలయాళం ఇంకా హిందీ భాషల్లోనూ ఈ చిత్రానికి వసూళ్లు క్రమ క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి.ఇక యూ ఎస్ లో కూడా సీత రామం సినిమాదే పైచేయిగా వుంది. సీతా రామం 1 మిలియన్ డాలర్లు వసూళ్లు చేయగా బింబిసార మాత్రం 500k డాలర్లు వసూలు చేసింది. అయితే ఇంకో రెండ్రోజుల్లో బింబిసార కూడా 1 మిలియన్ డాలర్ మార్క్ ని అందుకుంటుందని ట్రేడ్ నిపుణుల అంచనా.ఇక తెలుగు రాష్ట్రాల్లో వీకెండ్ తర్వాత బింబిసార కలెక్షన్లలో కొంచెం డ్రాప్ కనిపించగా.. సీతారామం సినిమా కలెక్షన్లు మాత్రం స్థిరంగా ఉన్నాయి. ఈవెనింగ్ ఇంకా నైట్ షోలకు హౌస్ ఫుల్స్‌తో రన్ అయింది సీతారామం. ముఖ్యంగా మల్టీప్లెక్సుల్లో అయితే ఆ చిత్రం పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. బుక్ మై షోలో బుకింగ్స్ చూస్తే మల్టీప్లెక్స్ స్క్రీన్లన్నీ ఫాస్ట్ ఫిల్లింగ్ ఇంకా దాదాపు సోల్డ్ ఔట్ మోడ్‌లో కనిపించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: