మహేష్ మానవత్వానికి ఇవే నిదర్శనాలు!

Purushottham Vinay
సినిమాల్లో తన క్లాస్, మాస్ యాక్షన్ తో అదరగొడుతూ టాలీవుడ్ నెంబర్ వన్ సూపర్ స్టార్ గా పేరు సంపాదించి ఎంతోమంది అభిమానులకి ఫేవరేట్ హీరోగా మారాడు సూపర్ స్టార్ మహేష్. తన ఎవర్ గ్రీన్ అందంతో ఎంతోమంది అమ్మాయిల మనసులను కొల్లగొట్టాడు రాజకుమారుడు మహేష్ బాబు.తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారి వారసత్వాన్ని తీసుకొని కేవలం సినిమాల్లో స్టార్ డం సంపాదించడమే కాక తన తండ్రిని మించి సేవా కార్యక్రమాల్లో కూడా రియల్ హీరోగా ఎదిగాడు. నేడు ఆగస్టు 9 మహేష్ బాబు పుట్టిన రోజు. సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఇంకా నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తమ సూపర్ స్టార్ కి బర్త్ డే విషెష్ తెలియచేస్తున్నారు.సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్నో సేవా కార్యక్రమాలతో ఎందరికో జీవితాలని ఇచ్చాడు ఇంకా ఇస్తున్నాడు.2016లో ఆంధ్రప్రదేశ్‌లోని తన తండ్రి స్వగ్రామమైన బుర్రిపాలెం ఇంకా తెలంగాణ రాష్ట్రంలోని సిద్దాపురం గ్రామాలను దత్తత తీసుకొని ఆ గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాడు మహేష్.ఇంకా అంతేకాక ఆ గ్రామాల్లో అనేక సామాజిక కార్యక్రమాలు అలాగే సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడు.మహేష్ బాబు చేసే ముఖ్యమైన సేవా కార్యక్రమం చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్స్.


ఇప్పటివరకు కూడా  గుండె సంబంధిత సమస్యలు ఉన్న 1300 కి మందికి పైగా చిన్నారులకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్స్ చేయించి ఎంతోమందికి కూడా ఆయన ప్రాణదానం చేశారు.ఆ పిల్లల తల్లిదండ్రులు అయితే మహేష్ ని దేవుడిగా చూస్తారు.ఇంకా గుండె సమస్య ఉన్న చిన్న పిల్లలు ఎంతమంది వచ్చినా తన సొంత ఖర్చులతో హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తానని ఆయన ప్రకటించారు.అలాగే హుదుద్‌ తుఫాను సమయంలో సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు విరాళంగా రూ.2.5 కోట్లు ఇంకా కరోనా సమయంలో సినిమా కార్మికులకు కోసం రూ. 25 లక్షలు అందించాడు.ఇలా ఎన్నో సార్లు ప్రభుత్వాలకు కష్టకాలంలో ప్రజల కోసం సహాయాన్ని అందించాడు సూపర్ స్టార్. అలాగే తాను దత్తత తీసుకున్న బుర్రిపాలెం గ్రామంలోని ప్రజలకు తన తండ్రి కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఫ్రీ వ్యాక్సిన్‌ డ్రైవ్‌ నిర్వహించి గొప్ప మనసు చాటుకున్నారు. ఇలా స్పెషల్ డేస్ లో ఏదో ఒక మంచి సేవా కార్యక్రమం నిర్వహిస్తారు మహేష్.ఇంకా అంతేకాక తన దగ్గర పని చేసేవాళ్ళ పిల్లల చదువులకి కూడా సూపర్ స్టార్ మహేష్ అవసరమైన సహాయాన్ని చేశాడు. ఈ విషయాన్ని స్వయంగా మహేష్ బాబు దగ్గర పనిచేస్తున్న వారే చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: