త్వరలో బుల్లితెర ప్రేక్షకులను అలరించబోతున్న 'కేజిఎఫ్ చాప్టర్ 2' మూవీ..!

Pulgam Srinivas
యాష్ హీరోగా శ్రీ నిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ పాన్ ఇండియా స్థాయిలో ఏ రేంజ్ విజయాన్ని అందుకుందో మన అందరికీ తెలిసిందే. కే జి ఎఫ్ చాప్టర్ 1 భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ముందు నుండే కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ పై దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
 

అలా భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 14 వ తేదీన థియేటర్ లలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకొని బాక్సా ఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి కలెక్షన్ ల వర్షం కురిపించింది. ఇలా బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సాధించిన కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ కొంత కాలం క్రితం నుండే అమెజాన్ ప్రైమ్ వీడియో లో  స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ కి 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో కూడా అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఇలా థియేటర్ మరియు 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లలో ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ మూవీ మరి కొన్ని రోజుల్లో బుల్లి తెర ప్రేక్షకులను కూడా అలరించబోతోంది.

ఈ సినిమా జీ తెలుగు లో  వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా త్వరలోనే ప్రసారం కానున్నట్లు జీ తెలుగు సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది. మరి కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ బుల్లి తెర ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ లో సంజయ్ దత్ విలన్ పాత్రలో నటించగా జ్ ఈ మూవీ కి రవి బుర్రుర్ సంగీతాన్ని అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: