పవన్, ప్రభాస్ సినిమాలు.. అందుకే చేయలదంటున్న శేఖర్ మాస్టర్?

praveen
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న టాప్ కొరియోగ్రాఫర్ లలో అటు శేఖర్ మాస్టర్ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. ప్రత్యేకమైన డాన్స్ కొరియోగ్రఫీ తో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు శేఖర్ మాస్టర్. ఈ క్రమంలోనే ఇప్పటివరకూ ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు అన్న విషయం తెలిసిందే. కాగా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన పాటలు యూట్యూబ్ ని కూడా షేక్ చేసాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక కొంతమంది హీరోలు అయితే శేఖర్ మాస్టర్ స్టైల్ నచ్చి తమ సినిమాలలో డాన్స్ మాస్టర్ గా పెట్టుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు.

 ఇలా ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్,రామ్ చరణ్, ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు స్టార్ హీరోలందరి సినిమాలకు పని చేశాడు శేఖర్ మాస్టర్. కానీ ఇప్పటివరకు పవన్ కళ్యాణ్, ప్రభాస్ సినిమాలకు మాత్రం పని చేయలేదట. అయితే ఈ ఇద్దరు హీరోల సినిమాలకు ఇప్పటివరకు పని చేయకపోవడం పై ఇటీవల శేఖర్ మాస్టర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇద్దరు హీరోలతో పని చేయక పోవడానికి బలమైన కారణాలు ఏమీ లేవు అంటూ శేఖర్ మాస్టర్ చెప్పుకొచ్చాడు. అయితే భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ కు పనిచేసే అవకాశం తనకు దక్కిందని చెప్పాడు.
 అయితే ఆ సాంగ్ షూటింగ్ రోజు  మెయిన్ టెక్నీషియన్ కి ఫీవర్ రావడంతో షూటింగ్ క్యాన్సల్ అయింది. ఆ తర్వాత ఆ సాంగ్ షూటింగ్ ప్రారంభమయ్యే సమయానికి నేను మరో షూటింగ్తో బిజీగా ఉన్నాను. అలా పవర్ స్టార్ తో పనిచేసే అవకాశం మిస్ అయింది అంటూ శేఖర్ మాస్టర్ చెప్పుకొచ్చాడు.  ఇక ప్రభాస్ నటించిన మిర్చి సినిమాకు పనిచేసే అవకాశం వచ్చినట్టే వచ్చి మళ్లీ పోయిందని శేఖర్ మాస్టర్ చెప్పుకొచ్చాడు. అప్పుడప్పుడే కొరియోగ్రాఫర్ గా ఎదుగుతున్న తనకు కొరటాల శివ అవకాశం ఇవ్వలేదని శేఖర్ మాస్టర్ తెలిపాడు. కానీ రానున్న రోజుల్లో తప్పకుండా ఇద్దరు హీరోలతో చేస్తాను అంటూ చెబుతున్నాడు శేఖర్ మాస్టర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: