ట్రైలర్: పాయల్ అందాలతో అయినా ఆది హిట్టు కొట్టేనా..?
ఇందులో ఆర్ఎక్స్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ హీరోయిన్గా నటిస్తూ ఉన్నది ఇక ఈ సినిమాలో కీలకమైన పాత్రలో.. హీరోయిన్ పూర్ణ, సునీల్ తదితరులు నటిస్తూ ఉన్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రంగా థియేటర్ ట్రైలర్ను విడుదల చేసింది. సక్సెస్ కోసం ఆది ఈసారి పక్కా మాస్ కమర్షియల్ సినిమాతో రాబోతున్నట్లుగా ఈ ట్రైలర్ను చూస్తే మనకు అర్థమవుతుంది. అయితే పోలీస్ ఆఫీసర్గా ఈసారి ఆది కాస్త దూకుడు చూపించాడని చెప్పవచ్చు.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ పాయల్ అందచందాలతో కుర్రకారులను ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది. మరి ఈమే అందాలతో నైనా ఈ సినిమాకి కలిసొస్తుందేమో చూడాలి. ఆది, పాయల్ మధ్య రొమాన్స్ కూడా కాస్త ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. తీస్ మార్ ఖాన్ అనే పక్కా రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ గా ఈ సినిమా అలరిస్తుందని చిత్ర బృందం తెలియజేస్తోంది. ఇక ట్రైలర్ లో కూడా ఆది వన్ మ్యాన్ షో అన్నట్లుగా వ్యవహరించారు. ఈ సినిమా హై వోల్టేజ్ యాక్షన్ సినిమాగా ఆడియన్స్ను ఆకట్టుకునే విధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాతో నైనా ఆది సక్సెస్ బాట పడతాడేమో చూడాలి మరి.