'మాచర్ల నియోజకవర్గం' మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు ఆయన నితిన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జయం మూవీ తో హీరోగా కెరీర్ ని మొదలు పెట్టిన నితిన్ ఇప్పటికే ఎన్నో విజయవంతమైన మూవీ లలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోగా తన కెరీర్ ని కొనసాగిస్తున్నారు. 

ఇది ఇలా ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నితిన్ తాజాగా మాచర్ల నియోజకవర్గం అనే పొలిటికల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ లో కృతి శెట్టి , క్యాథరీన్ లు హీరోయిన్ లుగా నటించగా , ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. మహతి స్వర సాగర్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించగా , సముద్ర ఖని ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. ఈ మూవీ ని ఆగస్ట్ 12 వ తేదీన భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకను కూడా చిత్ర బృందం ముగించింది.

ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి దర్శకుడు సురేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో తాజాగా మాచర్ల నియోజకవర్గం చిత్ర బృందం ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ మూవీ కి సెన్సార్ బోర్డ్ నుండి యు / ఎ సర్టిఫికెట్ లభించింది. మాచర్ల నియోజకవర్గం మూవీ లో నితిన్ కలెక్టర్ పాత్రలో నటించాడు. ఈ మూవీ తో నితిన్ ఏ రేంజ్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: