రెండు తెలుగు రాష్ట్రాల్లో 'మాచర్ల నియోజకవర్గం' మూవీ టికెట్ ధరలు ఇవే..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయిన నితిన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నితిన్ తాజాగా మాచర్ల నియోజకవర్గం అనే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీలో నితిన్ కలెక్టర్ పాత్రలో కనిపించబోతున్నాడు.  

ఈ మూవీ లో నితిన్ సరసన క్యాథరీన్ , కృతి శెట్టి లు హీరోయిన్ లుగా నటించగా, సముద్ర ఖని ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ మూవీ కి దర్శకత్వం వహించగా , మహతి స్వర సాగర్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ ని ఆగస్ట్ 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో ఇప్పటికే ఈ మూవీ నుండి కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా , వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. అలాగే తాజాగా మాచర్ల నియోజకవర్గం చిత్ర బృందం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా భారీ ఎత్తున నిర్వహించింది.

ఇది ఇలా ఉంటే మాచర్ల నియోజకవర్గం మూవీ టికెట్ ధరలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలా ఉండబోతున్నాయి... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాచర్ల నియోజకవర్గం టికెట్ ధరలు సింగిల్ స్క్రీన్ థియేటర్ లలో 147 రూపాయలు గాను ,  మల్టీప్లెక్స్ థియేటర్ లలో 177 రూపాయలుగా ఉండబోతున్నాయి.  తెలంగాణ రాష్ట్రంలో మాచర్ల నియోజకవర్గం మూవీ టికెట్ ధరలు సింగిల్ స్క్రీన్ థియేటర్ లలో 150 రూపాయలు గాను , మల్టీప్లెక్స్ థియేటర్ లలో 200 రూపాయలుగా ఉండబోతున్నాయి. ఇది ఇలా ఉంటే నితిన్ ఈ మూవీ తో ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: