ఆది సాయి కుమార్ 'తిస్ మర్ ఖాన్' మూవీ ట్రైలర్ విడుదల తేదీ వచ్చేసింది..!

Pulgam Srinivas
సాయి కుమార్ కుమారుడు ఆది సాయి కుమార్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆది సాయి కుమార్ ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరోగా తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను ఏర్పరుచు కున్నాడు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను ఏర్పరచుకున్న ఆది సాయి కుమార్ తాజాగా తిస్ మర్ ఖాన్ అనే మూవీ లో హీరోగా నటించాడు. విజన్ సినిమాస్ బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త డా.నాగం తిరుపతి రెడ్డి ఈ మూవీ ని నిర్మించగా , కళ్యాణ్ జి గోగణ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో ఆది సాయి కుమార్ సరసన పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని ఆగస్ట్ 19 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ బృందం ఇప్పటికే ప్రకటించింది.
 

ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో తాజాగా ఈ చిత్ర బృందం ఈ మూవీ కి సంబంధించిన ఒక అప్డేట్ ను విడుదల చేసింది. ఈ మూవీ ట్రైలర్ ను ఆగస్ట్ 8 వ తేదీన 3 గంటల 6 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్ లో ఆది సాయి కుమార్ పోలీస్ యూనిఫాం డ్రెస్ వేసుకొని జిప్ లో కూర్చొని ఉన్నాడు. ఇది ఇలా ఉంటే గత కొంత కాలంగా సరైన విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకోలేకపోతున్న ఆది సాయి కుమార్ ఈ మూవీ తో ఎలాంటి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: