బింబిసార vs సీతారామం: ఊపుమీదున్నది ఎవరు?

Purushottham Vinay
ఇక ప్రేక్షకులు థియేటర్స్ కి రావడం పూర్తిగా తగ్గించారని టాలీవుడ్ ఆందోళన చెందుతున్న సమయంలో ఒకేరోజు విడుదలైన 'బింబిసార', 'సీతా రామం' సినిమాలు అయితే మంచి రెండూ పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని మళ్ళీ ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పిస్తున్నాయి.ఇక ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే బింబిసార జోరు చాలా బాగా కనిపిస్తోంది. హౌస్ ఫుల్ బోర్డులు ఇంకా అదనపు షోలతో థియేటర్స్ దగ్గర ఫుల్ సందడి కనిపిస్తోంది. మొదటి రోజే ఈ సినిమా దాదాపు 50 శాతం రికవర్ చేయడం అనేది గొప్ప విశేషం. అయితే 'బింబిసార' సినిమా ప్రభంజనంలో కూడా క్లాసిక్ లవ్ స్టోరీ 'సీతా రామం' సినిమా తన మార్క్ చూపిస్తోంది.ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈ సినిమా మంచి కలెక్షన్స్ తో సత్తా చాటుతోంది. ఇక ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో మొత్తం రూ.11.50 కోట్ల బిజినెస్ చేసిన సీతా రామం.. తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ లో కలిపి మొదటి రోజు 1.50 కోట్ల షేర్(2.25 కోట్ల గ్రాస్) రాబట్టింది.


ఫస్ట్ డే నైజాంలో అయితే రూ.0.54 కోట్ల షేర్(బిజినెస్ 4 కోట్లు), సీడెడ్ లో అయితే రూ.0.16 కోట్ల షేర్(బిజినెస్ 1.50 కోట్లు), ఆంధ్రాలో రూ.0.80 కోట్ల షేర్(బిజినెస్ 6 కోట్లు) వసూలు చేసింది. ఓ వైపు 'బింబిసార' సినిమా జోరు, మరోవైపు క్లాస్ మూవీ కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో సత్తా చాటలేకపోయిన 'సీతా రామం' ఓవర్సీస్ లో మాత్రం చాలా దూకుడు చూపిస్తోంది.ఓవర్సీస్ లో ఈ సినిమా అయితే ఏకంగా రూ.1.05 కోట్ల షేర్(బిజినెస్ 2.50 కోట్లు)తో సత్తా చాటింది. కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా 0.15 కోట్ల షేర్ ఇంకా ఇతర భాషల్లో 0.35 కోట్ల షేర్ కలిపి.. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.3.05 కోట్ల షేర్ (5.60 కోట్ల గ్రాస్) ఈ సినిమా వసూలు చేసింది. వరల్డ్ వైడ్ గా రూ.16.20 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ మూవీ ఫస్ట్ డే కేవలం 19 శాతం రికవర్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: