అంజలి ఐటమ్ సాంగ్ కి అదిరిపోయే రెస్పాన్స్..!

Pulgam Srinivas
టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు అయిన నితిన్ తాజాగా మాచర్ల నియోజకవర్గం అనే పొలిటికల్ యాక్షన్ డ్రామా మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. కెరీర్ లో మొట్ట మొదటి సారి నితిన్ పొలిటికల్ యాక్షన్ జోనర్ మూవీ లో నటిస్తూ ఉండడంతో ఈ సినిమాపై నితిన్ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు.

అలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ మూవీ నుండి చిత్ర బృందం తాజాగా ఒక ట్రైలర్ ను విడుదల చేయగా, ఆ ట్రైలర్ కి కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.  ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించగా,  కృతి శెట్టి, క్యాథరీన్ ఈ మూవీ లో నితిన్ సరసన హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ ని ఆగస్ట్ 12 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా నుండి అంజలి నటించిన ఒక స్పెషల్ సాంగ్ ని మూవీ యూనిట్ విడుదల చేసింది. 'రా రా రెడ్డి ఐ యామ్ రెడీ' అంటూ సాగే ఈ సాంగ్ విడుదల అయిన కొన్ని రోజుల్లోనే ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ ను తెచ్చుకుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సాంగ్ అదిరిపోయే రేర్ మార్క్ వ్యూస్ ను టచ్ చేసింది. ఈ సాంగ్ కి యూట్యూబ్ సహా అన్ని సోషల్ మీడియా యాప్స్ లలో కలిపి ఏకంగా 500 మిలియన్ వ్యూస్ వచ్చినట్టుగా ఈ మూవీ మేకర్స్ ప్రకటించారు. ఇలా అంజలి నటించిన మాచర్ల నియోజకవర్గం మూవీ లోని  స్పెషల్ సాంగ్ కి ప్రేక్షకుల నుండి విపరీతమైన క్రేజ్ లభిస్తుంది. ఈ మూవీ కి మహతి సాగర్ సంగీతం అందించగా,  శ్రేష్ట్ మూవీస్ వారు ఈ మూవీని నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: