నాగార్జున కొడుకులను పట్టించుకోవడం లేదా!!

P.Nishanth Kumar
అక్కినేని నాగార్జున ఇప్పుడు గోస్ట్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నాగార్జున ఒక రా ఏజెంట్ గా కనిపించబోతున్నాడు. గతంలో ఈ తరహా సినిమాను చాలా సార్లు చేసిన నాగార్జున ఒక మంచి పాయింట్ తో ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే సగ భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే మిగిలిన షూటింగ్ చేసుకొని డిసెంబర్లో విడుదల కావడానికి సిద్ధమవుతుంది.

ఆ విధంగా నాగార్జున కు డిసెంబర్లో మంచి సెంటిమెంట్ ఉందని చెప్పవచ్చు. ఆ సమయంలో ఆయన విడుదల చేసే సినిమాలకు మంచి సక్సెస్ వస్తుంది. అదే విధంగా ఈ డిసెంబర్ నాటికి ఘోస్ట్ ను విడుదల చేసి ఆ తర్వాత ప్రేక్షకులను తదుపరి సినిమాలతో అలరించాలన్నది నాగార్జున ఆలోచన. అయితే ఓవైపు అక్కినేని నాగ చైతన్య తన సినిమా లతో ఫ్లాప్ లు అందుకోవడం ఇంకొక వైపు అఖిల్ తన సినిమా విడుదల పట్ల ఓ నిర్ణయానికి రాకపోవడం వంటివి చూస్తుంటే నాగార్జున తన కొడుకుల సినిమాలను ఏమాత్రం పట్టించుకోవడంలేదని తెలుస్తుంది.  

వాస్తవానికి మొదట్లో కొడుకులు చేసే సినిమాల కథల విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించేవాడు నాగార్జున. ఆ కథను తను ముందుగా విని ఆ తర్వాత అంతా సెట్ చేసి కొడుకులతో సినిమాలను చేసేవాడు కానీ ఇటీవల కాలంలో ఆయన బిజీగా ఉన్నారు. దాంతో వారిని వారి సినిమాలను ఆయన ఏమాత్రం పట్టించుకోవడంలేదని అంటున్నారు. మరి ఈ ముగ్గురు కెరీర్ లు కొంత ప్రమాదకరంలో ఉన్న నేపథ్యంలో ఏ విధంగా వారు మళ్ళీ కం బ్యాక్ అవుతారో చూడాలి. అఖిల్ ఇక ఏజెంట్ సినిమా పై తన పూర్తి నమ్మకాన్ని పెట్టుకున్నాడు. ఈ చిత్రం తప్పకుండ వంద కోట్ల క్లబ్బు లోకి చేరుతుంది అని కూడా చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: