తమిళ్ బాహుబలి సినిమా తెలుగులో కష్టమేనా..?

Divya
బాహుబలి అనే చిత్రం పాన్ ఇండియా పరిశ్రమకు ఒక బెంచ్ మార్క్ ను క్రియేట్ చేసిందని చెప్పవచ్చు. అన్ని భాషలలో ఇప్పుడు బాహుబలి రేంజ్ సినిమా అని తీయడం మొదలుపెట్టారు. అయితే తమిళ లెజెండ్ డైరెక్టర్ అయిన మణిరత్నం రూపొందిస్తున్న పోన్నియన్ సెల్వన్ అనే తమిళ సినిమా అక్కడ బాహుబలి అంటూ పలు మీడియా కథనాలలో తెలియజేయడం జరుగుతోంది. అయితే తమిళ సినీ ఇండస్ట్రీలో రూపొందుతున్న ఈ చిత్రం కచ్చితంగా బాహుబలి రేంజ్ లో ఉండబోతోంది అని బాహుబలి లాగే రెండు పార్ట్లు కలిసి వసూళ్లపరంగా మంచి విజయాన్ని అందుకుంటుంది అన్నట్లుగా అక్కడ ప్రచారం ఎక్కువగా జరుగుతున్నది.

ఒక తమిళనాడు, కేరళలో సినిమా ఆడితే బాహుబలి రేంజ్ వసూళ్లు సాధించడం కష్టమని తెలియజేస్తున్నారు.పోన్నియన్ సెల్వన్ ఇప్పటినుంచి ప్రమోషన్ పనులు మొదలుపెట్టారు. సెప్టెంబర్ 30న ఈ సినిమా విడుదల కాబోతోంది ఈ సినిమాకు సంబంధించి పలు పోస్టర్లు పాటలు ఈ సినిమా పైన భారీగానే అంచనాలను పెంచుతున్నాయి. ఇక ఈ సినిమా నుంచి విడుదలతున్న పబ్లిక్ సిటీ స్టాప్ తెలుగు ప్రేక్షకులలో మాత్రం అంతగా కనిపించలేదు. ఇక మొదటి పోస్టర్ విడుదలైన సమయంలో త్రిష, ఐశ్వర్యారాయ్ గెటప్పులను చూసి అందరూ షాక్ అయ్యారు. ఇవేమి గెటప్పులు రా బాబోయ్ అన్నట్లుగా కామెంట్లు చేశారు.

ఇక తర్వాత ఈ సినిమా నుంచి వచ్చిన పాట ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకులు మరింత సంతృప్తిని ఇచ్చేలా కనిపించినట్లు సమాచారం. ఇక సినిమా ప్రమోషన్స్ పూర్తిస్థాయిలో ప్రారంభించకుండానే తమిళంలో బాహుబలి సినిమా అంటూ ప్రచారం చేస్తున్న ఈ పోన్నియన్ సెల్వన్ చిత్రం తెలుగు ప్రేక్షకులలో పెద్దగా ప్రేక్షకులు పట్టించుకునే విధానంలో కాస్త తగ్గారని చెప్పవచ్చు మరి ముందు ముందు ఈ సినిమా పట్ల ఆసక్తికరమైన విషయాలను కనిపించకపోతే ఈ సినిమా తెలుగులో వసూళ్లు సాధించలేదని టాక్ కూడా వినిపిస్తోంది. ఇక తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఈ సినిమాకు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: