సీతారామం: వావ్ USAలో డీసెంట్ ప్రీ బుకింగ్స్!

Purushottham Vinay
దుల్కర్ సల్మాన్- మృణాల్ ఠాకూర్- రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా `సీతా రామం`. ఇది ఒక అద్భుత ప్రేమకథా చిత్రమని దుల్కార్ చెబుతున్నారు. ఈ మూవీ ఆగష్టు 5 వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఇంకా ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ ఫుల్ ఫ్లోలో సాగిపోతున్నాయి.ఇక సీతారామం కథాంశం పూర్తి యూనిక్ గా ఉంటుందని కథనం రక్తి కట్టించేవిధంగా ఉంటుందని దుల్కార్ చెబుతున్నారు. ఈ సినిమా పెద్ద తెరపై గొప్ప ట్రీట్ గా నిలుస్తుందని ఆయన నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ట్రైలర్ లో మీరు చూసింది చాలా చిన్నది. స్క్రీన్ ప్లే ఎంతో గిమ్మిక్ గా ఉంటుందని అదేమిటో తెరపైనే చూడాలని ఆయన అంటున్నాడు. తన వయసుకు తగ్గట్టు మునుముందు ప్రేమకథల్లోనే కాకుండా విభిన్న చిత్రాల్లో నటించాలనుందని కూడా దుల్కార్ సల్మాన్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు.


ఇక తాజా సమాచారం మేరకు.. సీతా రామం అమెరికా థియేట్రికల్ రైట్స్ ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ ప్రకారం పెద్ద రేటు పలికిందని తెలిసింది. మొత్తం 700K డాలర్ల రేంజు లో డీల్ సాగిందని కూడా తెలుస్తోంది. ఇక అంటే దీనివిలువ సుమారు ఇండియన్ కరెన్సీలో రూ 5.5 కోట్లు. అంటే అమెరికా బాక్సాఫీస్ నుంచి మినిమంగా  ఈ సినిమా 6 కోట్లు పైగా వసూలు చేయాల్సి ఉంటుందని ట్రేడ్ విశ్లేషిస్తోంది. ఇక ఇప్పటికే ప్రీ బుకింగ్స్ 100 K డాలర్ల పైగా బుక్ అయ్యాయి. హిట్ టాక్ వస్తే ఈ సినిమాకి లాభాలు రావడం పక్కా.ఇక సీతారామం అనేది క్లాసీ లవ్ డ్రామా.. ఇది USA ప్రేక్షకులకు బాగా సరిపోయే జానర్ కాబట్టి భారీ లక్ష్యంతో దుల్కార్ సల్మాన్ బరిలో దిగుతున్నాడని కూడా టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు జరగనుండగా ఈవెంట్ కి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: