మూవీస్: ఈ వారం థియేట్రికల్, డిజిటల్ రిలీజులు ఇవే!

Purushottham Vinay
ఈ వారం థియేట్రికల్ రిలీజులు విషయానికి వస్తే..అందులో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సి వస్తే బింబిసార అనే సినిమా మీద ప్రేక్షకుల్లో చాలా ఆసక్తి నెలకొంది. కళ్యాణ్ రామ్ హీరోగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్ పై  నిర్మిస్తున్న బింబిసార సినిమా అటు నందమూరి అభిమానులకే కాక తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఆసక్తికరంగా మారింది. ఒకప్పటి నిర్మాత మల్లిడి సత్యనారాయణ కుమారుడు మల్లిడి వశిష్ట్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన సంయుక్త మీనన్ ఇంకా కేథరిన్ థెరిసా అలాగే వరీనా న హుస్సేన్ వంటి వారు హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమా ట్రైలర్ అంచనాలను పెంచేయగా సినిమా చూసిన ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు కూడా సినిమా మీద ఆ అంచనాలను రెట్టింపయ్యేలా చేశాయి.ఇక అలాగే మరో సినిమా సీతారామం విషయానికి వస్తే దుల్కర్ సల్మాన్ నేరుగా లీడ్ రోల్ లో చేస్తున్న మొట్టమొదటి తెలుగు సినిమా ఇది. బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఆయన సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇక హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు యుద్ధంతో రాసిన ప్రేమ కథ అనేది ట్యాగ్ లైన్ ఉండడంతో సినిమా మీద ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఆ ట్రైలర్ ఒక్కసారిగా సినిమా మీద అంచనాలు రెట్టింపు అయ్యేలా చేసింది. తెలుగు, తమిళ ఇంకా అలాగే మలయాళ భాషల్లో రూపొందిన ఈ సినిమాను ఆగస్టు 5వ తేదీన విడుదల చేయబోతున్నారు.


ఇక అలాగే డిజిటల్ రిలీజ్ విషయానికి వస్తే..ఇక ఈ వారం డిజిటల్ వేదికగా విడుదల కాబోతున్న తెలుగు సినిమాల విషయానికి వస్తే ముందుగా గోపీచంద్ హీరోగా నటించిన పక్కా కమర్షియల్ సినిమా ఆహా వీడియో వేదికగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.థియేటర్లలో నిరాశపరిచిన ఈ సినిమా ఆగస్టు 5వ తేదీ నుంచి ఆహాలో సందడి చేయబోతోంది.అలాగే హన్సిక నటించిన మహా సినిమా కూడా ఆగస్టు 5వ తేదీ నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.ఈ సినిమా కూడా తమిళ ఇంకా తెలుగు భాషలలో ఆహా వీడియోలో అందుబాటులోకి రాబోతోంది. ఇక అలాగే పృథ్వీరాజ్ సుకుమార్ హీరోగా తెరకెక్కిన కడువా అనే సినిమా కూడా ఆగస్టు 4వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో అందరికీ అందుబాటులోకి రాబోతోంది. ఇక ఈ సినిమా తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం ఇంకా హిందీ భాషల్లో ఈ సినిమా ఏకకాలంలో విడుదలైంది. అలాగే అలియాబట్ హీరోయిన్ గా నటించిన డార్లింగ్స్ సినిమా కూడా ఆగస్టు 5వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో అందు బాటులోకి రాబోతోంది. ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలైతే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: