ఎన్టీఆర్ 30వ సినిమా ఈ సంవత్సరంలో ప్రారంభం కావడం కష్టమేనా..?

Pulgam Srinivas
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో 30 వ మూవీ గా తెరకెక్కబోతుంది. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చిత్ర బృందం చేసింది. ఈ మూవీ షూటింగ్ జూన్ నెల నుండే ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు కొంత కాలం క్రితం అనేక వార్తలు బయటకు వచ్చాయి.

అయితే జూన్ నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాలేదు. కొన్ని రోజుల క్రితం సెప్టెంబర్ నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కాక పోతే ప్రస్తుతం సెప్టెంబర్ నెలలో కూడా ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావడం కష్టమేనని తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాతే కొరటాల శివ ఈ మూవీ ని సెట్స్ పైకి  తీసుకువెళ్లాలని డిసైడ్ అయినట్లు,  ఆ కారణంగా ఈ సినిమా షూటింగ్ మరింత ఆలస్యంగా ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.  

దానితో ఈ సినిమా ఈ సంవత్సరం ప్రారంభం కావడం కష్టమే 2023 వ సంవత్సరంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ఇలా ఉంటే కొరటాల శివ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ కూడా సరి కొత్త లుక్ లోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించనుండగా ,  రత్నవేలు ఈ మూవీ కి సినిమాటోగ్రాఫర్ గా పని చేయనున్నాడు. ఈ మూవీ లో ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్ గురించి మూవీ యూనిట్ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: