తన దుస్తులపై కామెంట్.. ప్రగతి దిమ్మతిరిగే కౌంటర్?

praveen
ప్రగతి ఆంటీ.. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.. సోషల్ మీడియా ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే సినిమాల్లో ఎంతో పొందికైన పాత్రలలో నటిస్తూ తన నటనతో ఎలా ప్రేక్షకులను మెప్పిస్తు ఉంటుందో.. సోషల్ మీడియాలో అంతకుమించి అనే రేంజ్ లోనే రచ్చ చేస్తూ ఎప్పుడు నెటిజన్లను ఆకర్షిస్తూ ఉంటుంది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ  హాట్ టాపిక్ గా మారిపోతుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే  తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లో ప్రగతి ముందు వరుసలో ఉంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 సినిమాల్లో తన పాత్రలకు భిన్నంగా నిజజీవితంలో ప్రగతి జీవిస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఎందుకంటే సినిమాల్లో హీరో హీరోయిన్లకు తల్లి పాత్రలో నటిస్తూ ఎంతో బాధ్యతాయుతంగా ఉండే ఒక గృహిణిగా కనిపిస్తూ ఉంటుంది. కానీ నిజజీవితంలో ఎవరేమనుకున్నా పర్వాలేదు ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేయాల్సిందే అనే మైండ్సెట్ తో ఉంటుంది ప్రగతి. అయితే ఇప్పటివరకు ప్రగతి ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ అటు ఎఫ్ 3 సినిమాలో మాత్రం ప్రగతి కామెడీ టైమింగ్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది అని చెప్పాలి. సోషల్ మీడియాలో ఎవరైనా సెలబ్రిటీలు యాక్టివ్గా ఉంటే వారిపై అప్పుడప్పుడు నెగిటివ్ కామెంట్లు కూడా వస్తూ ఉంటాయి.

 అయితే ప్రగతి ఆంటీ అప్పుడప్పుడు జిమ్ లో కష్టపడుతూ ఆ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయడం చేస్తూ ఉంటుంది. అయితే ఇటీవల ప్రగతి చీరలో ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియోలో యాంగ్ కూడా కనిపించడానికి ప్రయత్నించడం లేదు.. దేశోద్ధారకులు రాలిగా నేను నా జీవితాన్ని గడుపుతున్నా అంటూ రాసుకొచ్చింది.  ఒక యువకుడు అలాగే బ్రతకండి మేడం ఇలాంటి బట్టలు వేసుకుని డాన్స్ చేయాలని మా వాళ్లకు తెలియదు.. అంటూ.  ఈ వీడియో మా వాళ్లకు పంపిస్తాను అంటూ సెటైర్ వేసాడు. అయితే దీనిపై స్పందించిన ప్రగతి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. ఇది మాకు నచ్చిన బ్రతుకు నాయనా.. నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకు అంటూ కౌంటర్ ఇవ్వడంతో   నెటిజన్ సైలెంట్ అయిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: