రెండు తెలుగు రాష్ట్రాల్లో 'సీతా రామం' టికెట్ ధరలు ఇవే..!

Pulgam Srinivas
దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాళిని  ఠాకూర్ హీరోయిన్ గా హను రాఘవపూడి దర్శకత్వంలో సీతా రామన్ అనే సినిమా తెరకెక్కిన విషయం మన అందరికి తెలిసిందే. సీతా రామం  సినిమా యుద్ధంతో రాసిన ప్రేమ కథ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కింది. ఈ మూవీ లో రష్మిక మందన ఒక కీలక పాత్రలో నటించగా , భూమిక చావ్లా ,  గౌతమ్ వాసుదేవ్ మీనన్ , సుమంత్ ఈ మూవీ లో ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.

ఈ సినిమాను ఆగస్ట్ 5 వ తేదీన భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ప్రమోషన్ లను కూడా మొదలు పెట్టింది. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను కూడా మూవీ యూనిట్ విడుదల చేయగా ,  ఈ మూవీ ట్రైలర్ ఆధ్యంతం ఉత్కంఠను రేపే విధంగా ఉండటం వల్ల ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ప్రేమ కథలను అద్భుతంగా వెండి తెరపై తెరకెక్కిస్తాడు అని పేరు కలిగిన దర్శకుడు హను రాఘవపూడి ఈ మూవీ కి దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

ఇలా మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో తక్కువ ధరలకే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. సీతా రామం టికెట్ ధరలు తెలంగాణ రాష్ట్రంలో సింగల్ స్క్రీన్ థియేటర్ లలో 150 రూపాయలు గాను , మల్టీప్లెక్స్ థియేటర్ లలో 200 రూపాయలు గాను , అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సింగిల్ స్క్రీన్  థియేటర్ లలో 147 రూపాయలు గాను ,  మల్టీప్లెక్స్ థియేటర్ లలో 177 రూపాయలు గాను ఉండనునట్లు  సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: