24 గంటల్లో ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ ను తెచ్చుకున్న 'మాచర్ల నియోజకవర్గం' మూవీ ట్రైలర్..!

Pulgam Srinivas
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తాజాగా మాచర్ల నియోజకవర్గం అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ లో సముద్ర కని ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. ఈ  మూవీ ని ఆగస్ట్ 11 వ తేదీన విడుదల చేయనున్నారు . ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో మూవీ యూనిట్ ఈ సినిమా ప్రమోషన్ ను వేగ వంతం చేసింది . అందులో భాగంగా తాజాగా మాచర్ల నియోజకవర్గం మూవీ యూనిట్ ఈ మూవీ నుండి  ట్రైలర్ ని విడుదల చేసింది .

మాచర్ల నియోజకవర్గం మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఉండటంతో పాటు నితిన్ హీరోయిజం ,  సముద్ర ఖని విలనిజం ఈ ట్రైలర్ లో అద్భుతంగా ఉండటంతో ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.  మాచర్ల నియోజకవర్గం మూవీ ట్రైలర్ విడుదల అయిన 24 గంటల్లో 13.11 మిలియన్ వ్యూస్ ని , 247 కే లైక్ లను సాధించింది. ఓవరాల్ గా చూసుకుంటే మాచర్ల నియోజకవర్గం మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది అని చెప్పవచ్చు. ఈ మూవీకి ఏం ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించగా , మహతి స్వర సాగర్ ఈ మూవీ కి సంగీతం అందించాడు.

ఈ మూవీ లో క్యాథరీన్ మరియు కృతి శెట్టి లు నితిన్ సరసన హీరోయిన్ లుగా నటించారు. తాజాగా విడుదల అయిన మాచర్ల నియోజకవర్గం ట్రైలర్ ను గమనిస్తే క్యాథరిన్ మరియు కృతి శెట్టి లు కూడా తమ అందచందాలతో సినిమా ద్వారా ప్రేక్షకులను బాగానే అలరించే విధంగా కనిపిస్తోంది. ఈ సినిమాలో నితిన్ కలెక్టర్ పాత్రలో కనిపించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: