రెండు తెలుగు రాష్ట్రాల్లో 'బింబిసార' టికెట్ ధరలు ఇవే..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి అంచనాల నడుమ విడుదల కు సిద్ధంగా ఉన్న ఈ మూవీ లలో కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన బింబిసార సినిమా ఒకటి . ఆగస్ట్ 5 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో ఈ మూవీ విడుదల కాబోతుంది . ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా ,  వీటికి ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది.

మరీ ముఖ్యంగా ఈ సినిమా నుండి మూవీ యూనిట్ విడుదల చేసిన రెండు ట్రైలర్ లకు కూడా ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం  మాత్రమే కాకుండా సినిమాపై అప్పటి వరకు ఉన్న అంచనాలను కూడా పెంచేశాయి. ఇది ఇలా ఉంటే ఈ సినిమా టికెట్ రేట్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ విధంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. బింబిసార మూవీ టికెట్ ధరలు తెలంగాణ లో మల్టీప్లెక్స్ థియేటర్ లలో 200 రూపాయలు గాను , సింగిల్ స్క్రీన్ థియేటర్ లలో 150 రూపాయలు గాను ఉండనున్నట్లు , అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మల్టీప్లెక్స్ థియేటర్ లలో 177 రూపాయలుగా , సింగిల్ స్క్రీన్ థియేటర్ లలో 147 రూపాయలు గా ఉండడనున్నట్లు సమాచారం.

ఇలా బింబిసార మూవీ ని తక్కువ టికెట్ ధరలకే రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో కళ్యాణ్ రామ్ సరసన క్యాథరిన్ , సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా నటిస్తుండగా ,  ఈ మూవీ కి మల్లాడి వశిష్ట్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో కళ్యాణ్ రామ్ రెండు డిఫరెంట్ వెరీయేషన్స్ ఉన్న పాత్రలలో మనకు కనిపించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: