అదే మ్యాటర్.. మాచర్ల ఎక్కడో కొడుతుందిగా!!

P.Nishanth Kumar
నితిన్ హీరోగా నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమా ఆగస్టు 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వ వహించిన ఈ సినిమా మాస్ మసాలా సినిమా గా రూపొందింది. తాజాగా ఈ సినిమా యొక్క టైలర్ విడుదల అయింది. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సముద్రఖని విలన్ పాత్రలో కనిపించనున్నాడు. పొలిటికల్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో నితిన్ కలెక్టర్ గా నటించబోతున్నాడు అని ట్రైలర్ ద్వారా తెలుస్తుంది.

ఈ చిత్రం యొక్క టైలర్ను బట్టి ఈ సినిమా మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని తీసిన సినిమాగా తెలుస్తుంది. ఎక్కువగా ప్రేక్షకులను అలరించే మాస్ అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. పాటలు కూడా ఇప్పటికే మాస్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తున్న నేపథ్యంలో చాలా రోజులుగా విజయాలను అందుకోలేకపోతున్న నితిన్ ఈ సినిమాతో తప్పకుండా మంచి విజయాన్ని అందుకోగలనని నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇకపోతే ఇంకొక వర్గం వారు ఈ సినిమాలో కొత్త ఏముంది అనే విమర్శలు చేస్తున్నారు.

ప్రతి సినిమాలో ఉన్నట్లుగానే ఓ విలన్.. ఆ విలన్ ని ఎదిరించడానికి హీరో అనే వారు చెబుతున్నారు. మాచర్ల నియోజకవర్గం కు కలెక్టర్ గా వెళ్ళిన హీరో అక్కడి విలన్ అన్యాయాలను అరికట్టడమే ఈ సినిమా యొక్క అసలు కథ అని వారు ఇట్టే చెప్పేస్తున్నారు. వాస్తవానికి టైలర్ ను బట్టి ఇదే నిజమని కూడా చెప్పవచ్చు. ఇంత సింపుల్ కథను ఏ విధంగా ఒప్పుకున్నాడు అనేది ఇక్కడ అసలు విషయం. మరి నితిన్ సినిమాలలో ఎంటర్టైన్మెంట్ బాగానే ఉంటుంది కాబట్టి ఈ సినిమాలో ఆ ఎంటర్టైన్మెంట్ కు కొదువ ఏమాత్రం లేదనిపిస్తుంది. మరి ఆ ఎంటర్టైన్మెంట్ ప్లస్ యాక్షన్ కలిసి ఈ సినిమాను వేరే లెవెల్ లో ప్రేక్షకులను అలరిస్తుందా అనేది చూడాలి. మణి శర్మ తనయుడు మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నాడు. ఇప్పటికే పాటలతో అలరించిన ఆయన బీజీఎమ్ తో కూడా ప్రేక్షకులను అలరించబోతున్నాడని ట్రైలర్ కు ఆయన సమకూర్చిన సంగీతాన్ని బట్టి చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: