'బింబిసార 2' లో ఎన్టీఆర్.. క్లారిటీ ఇచ్చిన కళ్యాణ్ రామ్..!!

Anilkumar
తాజాగా కళ్యాణ్ రామ్  హీరోగా మల్లిడి వశిష్ట్ డైరెక్షన్ లో తెరకెక్కిన బింబిసార మూవీ థియేటర్లలో విడుదల కావడానికి మరో 4 రోజులు మాత్రమే ఉంది.ఇకపోతే కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇక బింబిసార2 సినిమాలో తారక్ నటిస్తారని గత కొన్నిరోజులుగా వార్తలు ప్రచారంలోకి వస్తున్న సంగతి తెలిసిందే.ఇదిలావుంటే తాజాగా కళ్యాణ్ రామ్ బింబిసార2 లో తారక్ నటించడం లేదని క్లారిటీ ఇచ్చారు.ఇక అందరిలా నేను చందమామ కథలను వింటూ చదువుతూ పెరిగానని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు.

 అయితే ఇలాంటి నేపథ్యంలో వచ్చిన సినిమాలను చూసి తాను ఆనందించేవాడినని ఆయన అన్నారు. పోతే సోషియో ఫాంటసీ సినిమాలలో నటించే ఛాన్స్ నాకు కూడా వస్తే బాగుంటుందని నేను అనుకునేవాడినని ఆయన చెప్పుకొచ్చారు. ఇక నా కలను నిజం చేసిన డైరెక్ట వశిష్టకు కృతజ్ఞతలు అని కళ్యాణ్ రామ్ వెల్లడించారు.కాగా  ప్రొడ్యూసర్ హరి ఈ సినిమా నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీ పడలేదని కళ్యాణ్ రామ్ పేర్కొన్నారు.ఇకపోతే విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ సినిమాను ఓ రేంజ్ లో రూపొందించారని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు.

అంతేకాదు  అద్భుతమైన టెక్నీషియన్లు ఈ సినిమాకు పని చేశారని కళ్యాణ్ రామ్ తెలిపారు.ఇక  బింబిసార కథను రెండు భాగాలలో చెప్పాలని ముందే అనుకున్నామని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు. అయితే ఈ చిత్రానికి ఒకటి కంటే ఎక్కువ సీక్వెల్స్ చేయాలని అనుకుంటున్నామని కళ్యాణ్ రామ్ తెలిపారు.అంతేకాదు బింబిసార టీజర్ రిలీజైన సమయంలో కొంతమంది మగధీర సినిమాతో మరి కొందరు బాహుబలి సినిమాతో పోల్చారని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు. ఇకపోతే బింబిసార మూవీని గొప్ప సినిమాలతో పోల్చడం సంతోషంగా ఉందని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు. కాగా తెలుగు వాళ్లకు ఉన్న ఏకైక ఎంటర్టైన్మెంట్ సినిమానే అని కళ్యాణ్ రామ్ వెల్లడించారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: