ఓటీటీ లకు కలిసి వస్తున్న నిర్మాతల భేదాభిప్రాయాలు !

Seetha Sailaja
టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అభిప్రాయాలకు నిర్మాతల మండలి అభిప్రాయాలకు విపరీతమైన విభేదాలు ఉన్నట్లు సంకేతాలు వస్తున్నాయి. తమ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు అని ఓపెన్ గా చెపుతున్నప్పటికీ టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ బడా నిర్మాతలు చిన్న నిర్మాతలు అన్న రెండు వర్గాలుగా విడిపోయిందా అన్న సందేహాలు వస్తున్నాయి.

ముఖ్యంగా ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ వ్యవహార శైలి చాలామంది నిర్మాతలకు నచ్చడం లేదనీ గుసగుసలు వినిపిస్తున్నాయి. అశ్వినీ దత్ లాంటి ప్రముఖ నిర్మాత కూడ జరుగుతున్న పరిణామాల పై తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లుగా గాసిప్పులు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా సినిమాల ఓటీటీ రిలీజ్ పై నిర్మాతల మండలి తీసుకోబోయే నిర్ణయం ఓటీటీ సంస్థలకు లాభపడే విధంగా ఉంటుందా అన్న మాటలు కూడ వినిపిస్తున్నాయి.

5కోట్ల బడ్జెట్ తో తీసిన సినిమాను విడుదల తేదీ తరువాత నాలుగు వారాల గ్యాప్ తో ఓటీటీ లలో స్ట్రీమ్ చేసుకోవచ్చని అదేవిధంగా 5 కోట్ల పెట్టుబడి పై బడిన సినిమాలను 70 రోజుల తరువాత స్ట్రీమ్ చేసుకోవచ్చని నిర్మాతల మండలి చేయబోయే నిర్ణయంతో ఓటీటీ సంస్థల బేరసారాలు విపరీతంగా పెరుగుతాయి అని అంటున్నారు. ఒక హిట్ అయిన సినిమా గురించి కూడ 70 రోజుల తరువాత జనం మర్చిపోతారు.

అలాంటి పరిస్థితులలో ఫెయిల్ అయిన సినిమా గురించి అస్సలు పట్టించుకోరు. ఇండస్ట్రీలో హిట్స్ శాతం కేవలం మూడు శాతం లోపు ఉన్న పరిస్థితుల మధ్య 70 రోజుల తరువాత ఓటీటీ లో సినిమా విడుదల అంటే తాము స్ట్రీమ్ చేసినా ఎవరు చూస్తారు అంటూ ఓటీటీ సంస్థలు అడిగే ప్రశ్నలకు నిర్మాతల దగ్గర సమాధానాలు ఉండవని అంటున్నారు. దీనితో ఓటీటీ సంస్థలు నిర్మాతలకు ఇచ్చే ఎమౌంట్ మరింత తగ్గిపోతుందని అందువల్ల 70 రోజుల తరువాత స్ట్రీమింగ్ అంటే ఫెయిల్ అయిన భారీ సినిమాల పరిస్థితి ఏమిటి అంటూ చాలామంది సందేహాలు వ్యక్త పరుస్తున్నట్లు టాక్..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: