జబర్దస్త్ కొత్త యాంకర్.. హీరోయిన్ లెవెల్ ఎంట్రీ?

praveen
బుల్లితెర ప్రేక్షకులందరికీ కూడా జబర్దస్త్ కామెడీ షో గురించి కొత్తగా పరిచయం చేస్తే అది అతిశయోక్తే అవుతుంది అని చెప్పాలి. దాదాపు తొమ్మిదేళ్ల నుంచి జబర్దస్త్ కార్యక్రమం నిర్విరామంగా బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూనే వుంది. అన్ని షోల లాగానే ఒక సాదాసీదా కామెడీ షో గా ప్రారంభమైన జబర్దస్త్ ఊహించని రీతిలో బుల్లితెరపై సరికొత్త చరిత్ర సృష్టించింది. సినిమాల్లో కనిపించని కామెడీ జబర్దస్త్ లో అందిస్తూ ఇక ప్రేక్షకులందరినీ కూడా తనవైపు తిప్పుకుంది. జబర్దస్త్ కొన్నాళ్లకే బుల్లితెరపై టాప్ షో గా మారిపోయింది.

 అంతేకాదు ఇండస్ట్రీ లోకి రావాలనుకున్న ఎంతో మంది కొత్త వారికి.. చిన్న చిన్న కమెడియన్స్ కి కూడా జబర్దస్త్ చేరదీసిన తల్లి గా మారిపోయి చేరదీసింది  చెప్పాలి. అయితే ఇటీవలి కాలంలో జబర్దస్త్ కార్యక్రమంలో అనూహ్యమైన మార్పులు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా జబర్దస్త్ మొదలైన నాటి నుంచి యాంకర్గా వ్యవహరిస్తున్న అనసూయ ఇటీవల జబర్దస్త్ నుంచి తప్పుకునేందుకు సిద్ధమైంది అన్న విషయం తెలిసిందే. గత వారం  ప్రసారమైనది ఎపిసోడ్ ఇక అనసూయకు జబర్దస్త్ లో చివరి ఎపిసోడ్ అని చెప్పాలి. ఈ క్రమంలోనే  అనసూయ తర్వాత జబర్దస్త్ యాంకర్ గా ఎవరు రాబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది.

 అయితే ప్రస్తుతం ఎక్స్ ట్రా జబర్దస్త్ లో యాంకర్ గా కొనసాగుతున్న రష్మీ జబర్దస్త్ యాంకర్ గా కూడా రాబోతుందని అందరూ భావించారు. కానీ జబర్దస్త్ లోకి కొత్త యాంకర్ రాబోతుంది అని తెలుస్తోంది. ఈ క్రమంలోనే  వచ్చే వారం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలో కొత్త యాంకర్ ఎంట్రీకి సంబంధించి ఎంట్రీ చూపించారు. అయితే సినిమాలో హీరోయిన్ ఎంట్రీ ఉన్నప్పుడు ఎలా పల్లకిలో తీసుకువచ్చి ముందుగా చేతులు కళ్ళు ముక్కు చెవులు ఎలా చూపిస్తారో.. ఇక జబర్దస్త్ యాంకర్ కి కూడా హీరోయిన్ ఎంట్రీ అదే రేంజ్ లో చూపించారు. దీంతో కొత్త యాంకర్ ఎవరు అన్న ఆసక్తి అందరిలో పెరిగిపోయిందని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: