ట్రైలర్: మాస్ లెవెల్ లో అదరగొడుతున్న నితిన్.. విజయం వరించేనా...?

Divya
యూత్ స్టార్ నితిన్ హీరోగా నటిస్తున్న చిత్రం మాచర్ల నియోజకవర్గం.. ఈ సినిమాతో రాజశేఖర్ రెడ్డి డైరెక్టర్గా మారబోతున్నారు. ఇక విడుదలకు సిద్ధమైన ఈ సినిమాకు సంబంధించి ఎమోషన్ పనులు చాలా వేగంగా జరుపుతున్నారు చిత్ర బృందం. ఇప్పటికే విడుదలైన వాళ్ళు ప్రమోషన్ కంటెంట్ ఈ సినిమా పైన మంచి బజ్ ను క్రియేట్ చేశాయని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా నితిన్ అభిమానులు కూడా విశేషమైన స్పందనను కనబరిచారు.

ఈ నేపథ్యంలో గుంటూరులో జరిగిన గ్రాండ్ ఈవెంట్ లో క్రియేటికల్ ట్రైలర్ విడుదల చేయడం జరిగింది. అది కూడా ప్రముఖ డైరెక్టర్ అయిన అనిల్ రావుపూడి ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసి చిత్ర బృందానికి విషెస్ తెలియజేయడం జరిగింది. ట్రైలర్ విషయానికి వస్తే.. ఇక ఈ రోజున వైజాగ్ లో చాలా కొత్తగా కనిపిస్తోంది రా అని డైలాగుతో ఈ సినిమా ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ఈ సినిమా ట్రైలర్లు వినోదం మరియు యాక్షన్ సన్నివేశాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. ఇక ఇందులో సిద్ధార్థ రెడ్డి గా హీరో నితిన్ నటించడం జరుగుతోంది.

సముద్రఖని కూడా ఈ సినిమాలో విలన్ పాత్ర లో విలన్ పాత్రలో అద్భుతంగా నటించారని చెప్పవచ్చు. సినిమా ట్రైలర్లు త్రివిక్రమ్ బోయపాటి శ్రీను రాజమౌళి డైరెక్టర్ల పేరును బాగా ఉపయోగించుకున్నారని చెప్పవచ్చు. ఇక ట్రైలర్ కూడా మాస్ ఎలివేషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్లలో కృతి శెట్టి, క్యాథరిన్ ఈ ట్రైలర్ లో పెద్దగా ప్రాధాన్యత కనిపించలేదని చెప్పవచ్చు. ఇక హీరోయిన్ అంజలి కూడా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ అలరించిందని చెప్పవచ్చు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ రాజేంద్రప్రసాద్, మురళీకృష్ణ తదితరులు కూడా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల కాలంలో సరైన సక్సెస్ కోసం హీరో నితిన్ ఎదురుచూస్తున్నారు ఈ సినిమాతో కచ్చితంగా విజయాన్ని అందుకుంటారని ఆయన అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమా వచ్చేనెల 12 న విడుదల కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: