దూత సినిమా పై ఆ ఫ్లాప్ ఎఫెక్ట్ పడేనా!!

P.Nishanth Kumar
అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన థాంక్యూ సినిమా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. దిల్ రాజు నిర్మాతగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు తమన్ సంగీతం వహించగా ఇంతమంది మంచి మేకర్స్ పని చేసిన కూడా ఈ సినిమా ఫ్లాప్ భారి నుంచి తప్పించుకోకుండా ఉండలేక పోయింది. నాగచైతన్య తదుపరి సినిమాపై ఈ సినిమా యొక్క ఎఫెక్ట్ పడుతుందా అనేది ఎంతో ఆసక్తికరంగా మారింది.

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అమెజాన్ ప్రైమ్ కోసం నాగచైతన్య దూత అనే ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన చిత్రీకరణ కూడా మొదలయ్యింది. షూటింగ్ జరుపుకుంటున్న ఈ దూత సిరీస్ పై అందరూ మంచి అంచనాలు పెట్టుకున్నారు. మంచి కాన్సెప్ట్ ను చేసే దర్శకుడు విక్రమ్ కుమార్ ఎందుకు థాంక్యూ విషయంలో పొరపాటు పడ్డాడో తెలియదు కానీ ఈ దూత సినిమా మాత్రం తప్పకుండా మంచి కాన్సెప్ట్ అనే అంటున్నారు.

ఇప్పుడు  నాగచైతన్య ఫోకస్ అంతా తదుపరి సినిమాలపై ఉందని చెబుతున్నారు. విక్రమ్ ప్రభు దర్శకత్వంలో ఆయన ఓ ద్విభాషా చిత్రాన్ని ఇప్పటికే మొదలుపెట్టాడు. అంతేకాకుండా పరుశురామ్ దర్శకత్వంలోని సినిమాకు సైతం ఆయన పని చేస్తున్నాడు. అయితే కొంతమంది సినిమా నట వారసులు సినిమా సినిమాకు తమ రేంజ్ ను పెంచుకుంటూ పోవాలి కానీ నాగచైతన్య మాత్రం సినిమా సినిమాకు తన రేంజ్ ను తగ్గించుకుంటూ పోతున్నాడు అనే విమర్శలు వస్తున్నాయి. ఇతర స్టార్ హీరోల వారసులు ఏ విధంగా సినిమాలను చేస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే చైతు కెరీర్ ఆరంభం నుంచి ప్రేమ కథ సినిమాలను చేస్తూ బోర్ కొట్టిస్తున్న నేపథ్యం లో ఈ హీరో ఎప్పుడు మాస్ సినిమాలను చేసి అగ్ర హీరోగా మారతాడు అన్న అనుమానం ఆయన అభిమానులలో నెలకొంది. ఇప్పటికైనా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ప్రేమ కథ సినిమాలను మానేసి భారీ హిట్ చిత్రాలను చేయాలని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: