వచ్చే వారం బింబి సారా అయినా హిట్ అవుతుందా!!

P.Nishanth Kumar
గత కొన్ని వారాలుగా తెలుగు సినిమా పరిశ్రమలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే సినిమా ఏది కూడా విడుదల కావడం లేదు. వరుసగా మరొక వారం కూడా ప్రేక్షకులను నిరాశపరిచే సినిమానే విడుదల అయింది. ఆ విధంగా నిన్న ధియేటర్లలో విడుదలైన రామారావు ఆన్ డ్యూటీ చిత్రం ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది. కారణమేదైనా కూడా మాస్ ప్రేక్షకులను కూడా ఈ సినిమా అసలేమాత్రం అలరించలేడు. ఆ విధంగా మాస్ రాజా ఖాతాలో ఇప్పుడు మరొక ఫ్లాప్ వచ్చి చేరింది. దీంతో వచ్చే వారం విడుదలయ్యే సినిమాలపైనే టాలీవుడ్ మేకర్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

అలా కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబి సారా చిత్రం వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆగస్టు 5వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో అనేది చూడాలి. చారిత్రాత్మక నేపథ్యంలో చాలా రోజులుగా కళ్యాణ్ రామ్ రూపొందిస్తున్న ఈ సినిమా ఇప్పుడు విడుదలవడం విశేషం. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలను జోరుగా మొదలుపెట్టిన చిత్ర బృందం సినిమాపై ఎన్నో అంచనాలను కలిగి ఉన్నామని చెబుతోంది. వాస్తవానికి వెరైటీ సినిమాలను చేయడం లో సిద్ధహస్తుడు కళ్యాణ్ రామ్.

 ఆ విధంగా ఈ టైం ట్రావెలింగ్ సినిమాను చేస్తున్న కళ్యాణ్ రామ్ ఏ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాడు ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటాడో చూడాలి. కేథరిన్ తెరిసా హీరోయిన్ గా నటిస్తున్నా ఈ సినిమా కి వశిష్ఠ అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహిస్తూ ఉండడం విశేషం. పెద్ద సినిమాలేవి లేని నేపథ్యంలో మీడియం రేంజ్ హీరోల సినిమాలు వరుసగా విడుదల అవుతున్నాయి. ఇవేవీ కూడా ప్రేక్షకులకు పెద్దగా రుచించని నేపథ్యంలో భారీ నేపథ్యం కలిగిన ఈ సినిమా అయినా వారిని థియేటర్లకు రప్పిస్తుందా అనేది చూడాలి. ఓటీటీ లలో ఆసక్తికరమైన కంటెంట్లు రోజురోజుకు ఎక్కువైపోతున్న నేపథ్యంలో తెలుగులో థియేటర్లలోకి వచ్చే సినిమాల పట్ల ఎవరికి ఆసక్తి ఉండటం లేదు. ఈ నేపథ్యంలో ఈ వెరైటీ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవాలని అందరూ భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: