ఎన్టీఆర్ 30వ సినిమా అప్డేట్ లకు ఇంకా సమయం ఉంది... కళ్యాణ్ రామ్..!

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది . జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కాబోయే సినిమా ఎన్టీఆర్ కి కెరీర్ పరంగా 30 వ సినిమా .

ఇది వరకే ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ మూవీ తెరకెక్కిన విషయం మనకు తెలిసిందే. జనతా గ్యారేజ్ మూవీ ఆ సమయంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం, మాత్రమే కాకుండా కలెక్షన్ ల వర్షాన్ని కురిపించింది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కాబోయే వీరిద్దరి కాంబినేషన్ మూవీ పై యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా షూటింగ్ జూన్ లోనే ప్రారంభం కాబోతుంది అంటూ అనేక వార్తలు బయటకు వచ్చాయి. కాక పోతే ఇప్పటి వరకు కూడా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాలేదు.

అలాగే ఈ మూవీ కి సంబంధించిన ఎలాంటి అప్డేట్ ల్స్ను కూడా మూవీ యూనిట్ విడుదల చేయలేదు.  ఇది ఇలా ఉంటే తాజాగా ఎన్టీఆర్ 30 వ సినిమా ప్రొడ్యూసర్ లలో ఒకరు అయిన కళ్యాణ్ రామ్ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ... ఎన్టీఆర్ 30 వ సినిమా అప్డేట్ లకు ఇంకా సమయం ఉందని,  సరైన సమయం వచ్చినప్పుడు మూవీ కి సంబంధించిన మరిన్ని విషయాలను బయటకి తీసుకొస్తామని తాజా ఇంటర్వ్యూ లో కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: