'ప్రాజెక్ట్ కే' మూవీ ని అవెంజర్స్ స్టైల్ లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది... అశ్వినీ దత్..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో నిర్మాతగా సూపర్ సక్సెస్ అయిన  కొద్ది మందిలో అశ్వినీ దత్ ఒకరు . అశ్వినీ దత్ తన కెరీర్ లో ఇప్పటి వరకు ఎన్నో మూవీ లను నిర్మించి వాటితో ఎన్నో విజయాలను బాక్సా  ఫీస్ దగ్గర అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు .

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అశ్వినీదత్ తన వైజయంతి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రభాస్ హీరోగా దీపికా పదుకొనే హీరోయిన్ గా నాగ్ అశ్విన్ దర్శకత్వం లో ప్రాజెక్ట్ కే అనే భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ మూవీ ని తెరకెక్కిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ లో అమితాబచ్చన్ ఒక కీలక పాత్రలో కనిపించనుండగా ,  దిశా పటాని ఈ మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతుంది . ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది . ఇది ఇలా ఉంటే ప్రాజెక్ట్ కే మూవీ కి నిర్మాతగా వ్యవహరిస్తున్న అశ్వినీదత్ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు . తాజా ఇంటర్వ్యూ లో భాగంగా అశ్వనీదత్ 'ప్రాజెక్ట్ కే' మూవీ కి సంబంధించిన అనేక ఆసక్తికరమయిన విషయాలను తెలియజేశాను .

తాజా ఇంటర్వ్యూ లో అశ్వినీ దత్ మాట్లాడుతూ ... ప్రాజెక్ట్ కే మూవీ అవెంజర్స్ మూవీ స్టైల్ లో అందరిని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అమెరికా , చైనా మరియు ఇతర అంతర్జాతీయ మార్కెట్ లను లక్ష్యంగా పెట్టుకొని 18 అక్టోబర్ 2023 వ తేదీన లేదా జనవరి 2024 లో ఈ సినిమాను వీలైనంత విస్తృత స్థాయిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాము అని తాజా ఇంటర్వ్యూలో అశ్విని దత్ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: