ప్రభాస్ 'ప్రాజెక్ట్ కే' విడుదల తేదీ గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేసిన అశ్వినీ దత్..!

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ గురించి సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మిర్చి సినిమా వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగిన ప్రభాస్ 'మిర్చి' సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమాతో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు ను సంపాదించుకున్నాడు.

అలా బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్న ప్రభాస్ ఆ తర్వాత సాహో , రాధే శ్యామ్ వంటి భారీ బడ్జెట్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ రెండు సినిమాలు కూడా ప్రభాస్ కు బాక్సాఫీస్ దగ్గర కాస్త నిరాశనే మిగిల్చాయి. ఇది ఇలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ప్రాజెక్ట్ కే లో హీరోగా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుండగా , బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో ఒకరైన బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అలాగే దిశా పటాని కూడా ఈ మూవీ లో ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తుంది.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయి కొంత భాగం షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం కూడా ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని వైజయంతి బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మిస్తున్న విషయం మనకు తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అశ్వినీదత్ ప్రాజెక్ట్ కే సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. తాజా ఇంటర్వ్యూలో అశ్వినీదత్ మాట్లాడుతూ ...  ప్రాజెక్ట్ కే మూవీ ని 18 అక్టోబర్ 2023 వ తేదీన లేదా  2024 జనవరి లో విడుదల చేయనున్నట్లు తెలియజేశాడు. ఇలా తాజా ఇంటర్వ్యూలో అశ్వినీదత్ ప్రాజెక్టు కే సినిమా విడుదలకు సంబంధించి ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: