చిరంజీవి 'భోళా శంకర్' అలా ఉండబోతోందా..?

Anilkumar
టాలీవుడ్ లో  ఉన్న అగ్ర నిర్మాతలలో అనిల్ సుంకర ఒకరు. అయితే ఈయన నిర్మాతగా ఆయన ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పలు మీడియం, భారీ బడ్జెట్ సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా నిర్మిస్తున్నారు.ఇకపోతే మంచి అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్న ఆయన వరుసగా సినిమాలను నిర్మిస్తూ వస్తున్నారు.  ఇదిలావుంటే ఇటీవల కాలంలో సూపర్ స్టార్ మహేష్ హీరోగా సరిలేరు నీకెవ్వరు, అల్లరి నరేష్ హీరోగా బంగారు బుల్లోడు వంటి మూవీస్ తీసి మంచి విజయాలు అందుకున్నారు. ఇక ఇదిలావుండగా  ప్రస్తుతం అఖిల్  హీరోగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి  దర్శకత్వంలో ఏజెంట్  సినిమాను నిర్మిస్తున్నారు.

అంతేకాదు దీనితో పాటుగా మెగాస్టార్ చిరంజీవి  - మెహర్ రమేష్  కాంబినేషన్‌లోనూ తమిళ హిట్ మువీ వేదాళం కి రీమేక్‌గా భోళా శంకర్  మూవీని నిర్మిస్తున్నారు. అయితే ఇక  తమ సంస్థలో ప్రస్తుతం నిర్మిస్తున్న సినిమాల గురించి ఇటీవల పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు అనిల్ సుంకర. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "ఇప్పటివరకు కెరీర్ లో చేసిన చాలా సినిమాలు ప్రేక్షకుల ఆదరణ అందుకున్నాయి.  అంతేకాదు ప్రస్తుతం చేస్తున్న రెండు చిత్రాలు కూడా మంచి సక్సెస్ అందుకుంటాయని నమ్మకంతో ఉన్నాను" అని అన్నారు.

అయితే ఇదే క్రమంలో ప్రత్యేకంగా మెగాస్టార్ చిరంజీవితో నిర్మిస్తున్న భోళా శంకర్ గురించి అనిల్ సుంకర మాట్లాడుతూ.. మెహర్ రమేష్ ఈ మూవీని ఎంతో అద్భుతంగా తీస్తున్నారు. ఇక సిస్టర్ సెంటిమెంట్ ప్రధానాంశంగా సాగినప్పటికీ మెగా ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరూ కోరుకునే అన్ని కమర్షియల్ హంగులు సినిమాలో ఉంటాయి. అంతేకాదు అవుట్ ఫుట్ బాగా వస్తోంది. ఇకపోతే వచ్చే ఏడాది రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము. అయితే ఈ మూవీ తప్పకుండా మంచి సక్సెస్ సాధిస్తుంది..అని తన నమ్మకాన్ని వ్యక్తపరిచారు. కాగా నిర్మాత అనిల్ సుంకర చెప్పిన విషయాలను చూస్తే ఖచ్చితంగా మెగాస్టార్ భోళా శంకర్ భారీ హిట్ అని అర్థమవుతోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: