ఆ రేర్ మార్క్ ని టచ్ చేసిన 'మాచర్ల నియోజకవర్గం' మూవీలోని 'రా రా రెడ్డి ఐ యాం రెడి' సాంగ్..!

Pulgam Srinivas
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన మాచర్ల నియోజకవర్గం అనే రాజకీయ నేపథ్యం కలిగిన సినిమాలో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో నితిన్ కలెక్టర్ పాత్రలో కనిపించ బోతున్నాడు. ఈ మూవీ లో  క్యాథరీన్ మరియు కృతి శెట్టి లు హీరోయిన్ లుగా నటించగా సముద్ర ఖని ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు.
 

ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ ని ఆగస్ట్ 12 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో ఈ చిత్ర బృందం ఇప్పటికే ప్రమోషన్ లను కూడా మొదలు పెట్టింది. అందులో భాగంగా ఈ మూవీ కి సంబంధించిన ఒక్కో సాంగ్ ని మూవీ యూనిట్ విడుదల చేస్తూ వస్తోంది. అందులో భాగంగా మాచర్ల నియోజకవర్గం మూవీ నుండి ఫస్ట్ సింగిల్ గా 'రా రా రెడ్డి ఐ యామ్ రెడీ' అనే సాంగ్ ని మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ సాంగ్ లో అంజలి నటించింది. మహతి స్వర సాగర్ అందించిన మ్యూజిక్ సాంగ్ కి హైలెట్ గా నిలవగా , నితిన్ , అంజలి డాన్స్ పెర్ఫార్మెన్స్ ఈ సాంగ్ కి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అలాగే ఈ సాంగ్ లో అంజలి అందచందాలు ఈ సాంగ్ కు మరింత క్రేజ్ ను తీసుకువచ్చాయి.

ఇది ఇలా ఉంటే ఈ సాంగ్ విడుదల అయినప్పటి నుండి ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ ను తెచ్చుకుంటుంది. అందులో భాగంగా తాజాగా ఈ సాంగ్ యూట్యూబ్ లో  ఓ రేర్ మార్క్ వ్యూస్ ని టచ్ చేసింది. ఈ సాంగ్ తాజాగా 25 మిలియన్ ల వ్యూస్ ని సాధించింది. ఇలా మాచర్ల నియోజకవర్గం మూ వీలోని 'రా రా రెడీ ఐ ఆమ్ రెడీ' సాంగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ లో వ్యూస్ ని దక్కించుకుంటూ ముందుకు దూసుకుపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: