ఆది సాయి కుమార్ 'తీస్ మర్ ఖాన్' మూవీ నుండి 'సమయానికే' సాంగ్ విడుదల తేది వచ్చేసింది..!

Pulgam Srinivas
తెలుగు సినీ ప్రేమికులకు ఆది సాయి కుమార్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రేమ కావాలి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకని టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ హీరోగా మంచి గుర్తింపును దక్కించుకున్నాడు.
 

ఆ తర్వాత అనేక సినిమాలలో హీరోగా నటించిన ఆది సాయి కుమార్ ప్రస్తుతం కూడా వరుస సినిమాలలో హీరోగా నటిస్తున్నాడు. అందులో భాగంగా ప్రస్తుతం ఆది సాయి కుమార్ 'తీస్ మర్ ఖాన్' అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఆది సాయి కుమార్ కు జంటగా పాయల్ రాజ్ పుత్ నటిస్తోంది. కల్యాణ్‌ జి. గోగణ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తుండగా , సునీల్ , పూర్ణ ఈ మూవీ లో కీలకమైన పాత్రలలో కనిపించబోతున్నారు. నాగం తిరుపతి రెడ్డి ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ లో ఆది సాయి కుమార్ మూడు డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ చిత్ర బృందం ఈ సినిమా నుండి ఒక అప్డేట్ ను విడుదల చేసింది.

తాజాగా తీస్ మర్ ఖాన్ చిత్ర బృందం ఈ సినిమా నుండి 'సమయానికే' అనే వీడియో సాంగ్  ని జూలై 25 వ తేదీన మధ్యాహ్నం 1 : 04 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్ లో ఆది సాయి కుమార్ మరియు పాయల్ రాజ్ పుత్ ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: