పది రోజుల్లో అన్ని కోట్ల కలెక్షన్లు సాధించిన రామ్ పోతినేని 'ది వారియర్' మూవీ..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఈ మధ్య కాలంలో మంచి అంచనాలతో విడుదలయిన ఈ సినిమాలలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన ది వారియర్ సినిమా ఒకటి. ఈ సినిమాకు తమిళ దర్శకుడు లింగుసామి దర్శకత్వం వహించగా , ఈ మూవీ లో రామ్ పోతినేని సరసన  ప్రతి శెట్టి కథానాయికగా నటించింది.

ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించగా , ఆది పినిశెట్టి ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు.  ఈ సినిమాలో రామ్ పోతినేని పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించగా , రామ్ పోతినేని కి తల్లిగా నదియా నటించింది. ఈ సినిమా మంచి అంచనాల నడుమ జూలై 14 వ తేదీన తెలుగు , తమిళ భాషల్లో విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది. ఇప్పటి వరకు 10 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న ది వారియర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్లను సాధించిందో తెలుసుకుందాం.


నైజాం : 5.72 కోట్లు ,
సీడెడ్ : 3.07 కోట్లు ,
యూ ఏ : 2.39 కోట్లు ,
ఈస్ట్ : 1.33 కోట్లు ,
వెస్ట్ : 1.16 కోట్లు ,
గుంటూర్ : 1.94 కోట్లు ,
కృష్ణ : 94 లక్షలు ,
నెల్లూర్ : 64 లక్షలు .
పది రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో ది వారియర్ మూవీ 17.19 కోట్ల షేర్ , 26.65 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కర్ణాటక మరియు రెస్టాఫ్ ఇండియాలో : 1.05 కోట్లు .
ఓవర్ సీస్ లో : 67 లక్షలు .
తమిళ్ లో 1.25 కోట్లు .
పది రోజులకు గాను ప్రపంచ వ్యాప్తంగా ది వారియర్ మూవీ 20.16 కోట్ల షేర్ , 34.40 కోట్ల గ్లాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: