ఇంకా కథకు రిపేర్ లు చెబుతున్న పవన్!!

P.Nishanth Kumar
పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కవలసిన సినిమాల జాబితా బాగానే ఉంది. ముందుగా క్రిష్ దర్శకత్వంలోని సినిమాను పూర్తి చేయ డానికి పవన్ కళ్యాణ్ సన్నాహాలు చేస్తున్నాడు. ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయవలసిన సినిమాను లైన్లో పెట్టనున్నాడు. వాస్తవానికి ఈ రెండు సినిమాలు ఎప్పుడో పూర్తి చేయవలసిన పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా మొదలు పెట్టకపోవడం అందరిని ఎంతగానో ఆశ్చర్యపరుస్తుంది.

వరుస విజయాలు సాధిస్తున్న కూడా రాజకీయ కార్యకలాపాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ విధంగా ఈ సినిమాలను ఆలస్యం చేస్తూ వచ్చాడు అంతేకాకుండా ఈ సినిమాను పక్కనపెట్టి వేరే సినిమాలో చేయడం ఈ సినిమాలో ఆగిపోవడానికి ప్రముఖ కారణం ఇప్పుడు కూడా సినిమాలను కాదని మరొక తమిళ రీమేక్ సినిమా చేయడానికి ఆయన సిద్ధమవుతున్నాడు. తక్కువ రోజులలో పూర్తయ్యే సినిమా కావడంతో పవన్ కళ్యాణ్ ఆ చిత్రాన్ని ఒప్పుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇందులో సాయి ధరమ్ తేజ్ కూడా ఓ హీరోగా నటిస్తున్నాడు. ఇకపోతే ఇన్ని రోజుల తర్వాత కూడా పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ స్క్రి ప్ట్ పై కొన్ని మార్పులు చెప్పడం ఆయన అభిమానులను ఎంతగానో కలచివేస్తుంది. సినిమా అనౌన్స్ జరిగి రెండు సంవత్సరాలు కావస్తున్న కూడా ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ఫైనల్ కాకపోవడం అసలు ఈ సినిమా తెరకెక్కుతుందా అన్న అనుమానాలను కలిగిస్తుంది. ఇటీవలే ఫైనల్ నరేష్ వినిపించడానికి వెళ్లిన హరీష్ శంకర్ కు మరి కొన్ని మార్పులు చెప్పి దాన్ని తయారు చేయవలసిందిగా పవన్ కళ్యాణ్ అన్నారట. ఆ విధంగా హరీష్ శంకర్ గత రెండేళ్లుగా ఒక సినిమా చేయకుండా ఈ సినిమా కోసం ఉండడం ఆయన అభిమానులను నిరాశ పరుస్తుంది. దర్శకుడిగా మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్ మంచి హీరోలను ఎంచుకొని గొప్ప సినిమాలను చేయాలని వారు భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: