అనసూయ మా కోసం మూడు రోజులు ఇవ్వలేవా.. చంటి ఎమోషనల్?

praveen
జబర్దస్త్ కార్యక్రమం తో యాంకర్ అనసూయ ప్రయాణం ముగిసింది. వచ్చేవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ తో ఇక యాంకర్ అనసూయ జబర్దస్త్ కార్యక్రమంలో కనిపించదు. ఈ క్రమంలోనే అనసూయ అభిమానులు మాత్రమే కాదు జబర్దస్త్ కమెడియన్స్ కూడా ఈ విషయాన్ని తట్టుకోలేకపోతున్నారూ. ఎందుకంటే జబర్దస్త్ మొదలైన నాటి నుంచి తన వాక్చాతుర్యంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతే కాదు జబర్దస్త్ కమెడియన్స్ అందరితో కూడా అనసూయకు ఒక స్పెషల్ బాండింగ్ ఏర్పడింది.

 ఒకరకంగా అనసూయ సహా జబర్దస్త్ కమెడియన్స్ అందరూ కూడా కుటుంబ సభ్యుళ్లాగ ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు అని చెప్పాలి. అలాంటిది ఇక అనసూయ జబర్దస్త్ లో కనిపించదు అనే విషయాన్ని అసలు తట్టుకోలేకపోతున్నారు జబర్దస్త్ కమెడియన్స్. అటు ఆడియన్స్ సైతం అనసూయ జబర్దస్త్ లోనే ఉండి పోవాలి అంటూ సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ లు పెడుతూ ఉండడం గమనార్హం. కాగా ఇప్పటికే జబర్దస్త్ మానేసిన అనసూయ  స్టార్ మా లో ఒక కార్యక్రమంలో యాంకర్ గా కనిపిస్తుంది అన్న విషయం తెలిసిందే.

 ఇక పోతే వచ్చే వారం జబర్దస్త్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇటీవల సోషల్ మీడియాలో విడుదలై హాట్ టాపిక్ గా మారిపోయింది. ఒకసారి ఈ ప్రోమో చూసుకుంటే ఇక అనసూయ చివరి ఎపిసోడ్ కావడంతో అందరూ ఎంతో ఎమోషనల్ గానే ఉన్నారు. ఈ క్రమంలోనే అందరి మనసులో మాట బయట పెట్టాడు చలాకి చంటి. అనసూయ మా కోసం జబర్దస్త్ కి నెలకు మూడు రోజులు కేటాయించలేవా అంటూ ఎంతో దీనంగా అడిగాడు చలాకి చంటి. అయినప్పటికీ యాంకర్  అనసూయ మాత్రం లోపల బాధ దాచుకుని కేవలం చిరునవ్వుతోనే సమాధానం చెప్పింది. ఇక ఇటీవల విడుదలైన ప్రోమో మొత్తం ఎంతో  ఎమోషనల్ గా సాగిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: