'థాంక్యూ' సినిమా డిజిటల్ హక్కులను దక్కించుకున్నారని రెండు ప్రముఖ సంస్థలు..!

Pulgam Srinivas
టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు అయినా నాగ చైతన్య తాజాగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన థాంక్యూ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే . లవ్ స్టోరీ , బంగార్రాజు లాంటి రెండు వరుస విజయాల తర్వాత నాగ చైతన్య నటించిన సినిమా కావడంతో థాంక్యూ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు .

అలా మంచి అంచనాల నడుమ థాంక్యూ సినిమా నిన్న అనగా జులై 22 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యింది . మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన థాంక్యూ సినిమా బాక్సా ఫీస్ దగ్గర ఫర్వాలేదు అనే రేంజ్ టాక్ ని సొంతం చేసుకుంది . ప్రస్తుతం ఈ సినిమా థియేటర్ లలో పర్వాలేదు అనే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తూ ముందుకు దూసుకుపోతోంది. ఈ మూవీ లో నాగ చైతన్య సరసన రాశి కన్నా హీరోయిన్ గా నటించగా , ఎస్ ఎస్ తమన్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ ని దిల్ రాజు నిర్మించగా ,సి ఈ మూవీ లో అవికా గోర్ మరియు మాళవిక నైర్ లు కీలక పాత్రలో నటించారు.

ఇది ఇలా ఉంటె ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను రెండు ప్రముఖ 'ఓ టి టి' సంస్థలు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం థాంక్యూ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ సంస్థలు అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు సన్ నెక్స్ట్  వారు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.  ఈ సినిమా థియేటర్ రన్ కొన్ని వారాలు ముగిసిన తరువాత ఈ మూవీ ని డిజిటల్ ప్లాట్ ఫామ్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: